Telugu Gateway
Cinema

రవితేజ ‘ఏఏఏ’ కాన్సెప్ట్ టీజర్ విడుదల

రవితేజ ‘ఏఏఏ’ కాన్సెప్ట్ టీజర్ విడుదల
X

ఈ ట్రిబుల్ ‘ఏ’ ఏంటి అనుకుంటున్నారా?. అదేనండి రవితేజ హీరోగా నటిస్తున్న అమర్..అక్భర్..అంటోనీ సినిమానే ఇది. ఈ సినిమా దర్శకుడు శ్రీను వైట్ల పుట్టిన రోజును పురస్కరించుకుని చిత్ర యూనిట్ సోమవారం నాడు ‘కాన్సెప్ట్ టీజర్’ను విడుదల చేసింది. ఇందులో రవితేజ మూడు షేడ్స్ లో ఉన్న చిత్రాలను చూపించారు. అంటే తొలిసారి ఈ ఎనర్జిటిక్ హీరో త్రిపాత్రిభనం చేస్తున్నాడన్న మాట.

అంతే కాదు..సక్సెప్ ఫుల్ కాంబినేషన్ రవితేజ, ఇలియానా జోడీ సుదీర్ఘ విరామం తర్వాత తెరపై సందడి చేయనుంది. ఈ సినిమాను హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’ తెరకెక్కిస్తోంది. అక్టోబర్ 5నే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల జోరు కూడా పెంచనున్నారు.

https://www.youtube.com/watch?v=NNWJZLXt87A

Next Story
Share it