నితిన్ జోడీగా రష్మిక!
BY Telugu Gateway22 Sept 2018 11:14 AM IST
X
Telugu Gateway22 Sept 2018 11:14 AM IST
రష్మిక మందన. టాలీవుడ్ లో వరస పెట్టి హిట్లు అందుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ఆమె నటించిన ఛలో, గీత గోవిందం సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. మరో సినిమా దేవదాస్ లోనూ రష్మిక తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదల కాబోతోంది. రష్మిక చేసిన సినిమాలు అన్నీ వరస హిట్లు అవుతుండటంతో ఆమెకు అవకాశాలు కూడా అలాగే వస్తున్నాయి. టాలీవుడ్ ఎప్పుడైనా హిట్స్ ఉన్న వారివైపే చూస్తుంది.
అందులో భాగంగానే ఈ అమ్మడికి నితిన్ తో కలసి ప్రాజెక్టు వచ్చినట్లు సమాచారం. ఈ సినిమా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కనుంది. వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఛలోతో మంచి హిట్ అందుకున్న వెంకీ కుడుముల మరో సరదా కథతో నితిన్ పై సినిమాను తెరకెక్కించనున్నారు.
Next Story