Telugu Gateway
Andhra Pradesh

మళ్ళీ బాండ్స్..500 కోట్ల అప్పు

మళ్ళీ బాండ్స్..500 కోట్ల అప్పు
X

అప్పు ముఖ్యం. వడ్డీ కాదు. వడ్డీ ఎంతైనా పర్వాలేదు..మాకు నిధులివ్వండి చాలు అంటున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ఇలా కేవలం వ్యక్తులు మాత్రమే చేస్తారు. కానీ ఏపీ ప్రభుత్వం కూడా వ్యక్తుల తరహాలోనే రాష్ట్ర ప్రజల భవిష్యత్ ను అప్పుల కోసం తాకట్టుపెడుతోంది. అవసరం ఉన్న వాటికి లేని వాటికి వేల కోట్ల రూపాయలు అప్పులు చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు వంటి వాటి కోసం కూడా ఏకంగా 400 కోట్ల రూపాయలు అప్పులకు ఆమోదం తెలిపింది. ఇప్పటికే రాజధాని కోసం అమరావతి బాండ్లు అంటూ 2000 కోట్ల రూపాయలు సమీకరించిన సర్కారు..మరో 500 కోట్ల రూపాయలను బాండ్స్ ద్వారా సమీకరించేందుకు రెడీ అయింది. అయితే ఈ సారి అప్పుల కోసం పబ్లిక్‌ ఇష్యూకు వెళ్లబోతోంది. ఈ అప్పును విజయవంతంగా పూర్తి చేసే లీడ్‌ మేనేజర్‌ను ఎంపిక చేసేందుకు సీఆర్‌డీఏ ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులను ఆహ్వానించింది. ముగ్గురు మర్చంట్‌ బ్యాంకర్లతో లీడ్‌ మేనేజర్‌ను నియమించాలని ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులో సీఆర్‌డీఏ స్పష్టం చేసింది.

లీడ్‌ మేనేజర్‌ ఫీజును దరఖాస్తుల ద్వారా తెలియజేయాల్సిందిగా సీఆర్‌డీఏ తెలిపింది. ఎంపిక చేసిన లీడ్‌ మేనేజర్‌ ఇష్యూను సక్సెస్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. వ్యవహరిస్తారు. ఇటీవల అమరావతి బాండ్లు జారీచేసిన సమయంలో దళారీగా వ్యవహరించిన సంస్థకు రూ. 17 కోట్లను సీఆర్‌డీఏ చెల్లించిన విషయం తెలిసిందే. ఒకే విడత గానీ లేదా రెండు మూడు విడతల్లో గానీ బాండ్లు ద్వారా పబ్లిక్‌ ఇష్యూకు వెళ్లనున్నట్లు సీఆర్‌డీఏ పేర్కొంది. ఈ బాండ్లు కాలపరిమితి మూడేళ్ల నుంచి 15 ఏళ్ల వరకు ఉంటుందని తెలిపింది. లీడ్‌ మేనేజర్‌ ఎంపిక కోసం బిడ్లు దాఖలకు వచ్చే నెల 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు సమయం ఇచ్చారు. అదేరోజు సాయంత్రం 5.30 గంటలకు బిడ్లు తెరవనున్నట్లు సీఆర్‌డీఏ పేర్కొంది. ఇందుకు సంబంధించి ఈ నెల 25వ తేదీన ప్రీబిడ్‌ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సీఆర్‌డీఏ పేర్కొంది. అమరావతి బాండ్లు పేరిట పబ్లిక్‌ ఇష్యూ ద్వారా జారీ చేసే బాండ్లను వ్యక్తులు, సంస్థలు కొనుగోలు చేసేందుకు వీలుంటుంది.

Next Story
Share it