Telugu Gateway
Cinema

ఎన్టీఆర్ కోసం ‘పూజా స్పెషల్ జర్నీ’!

ఎన్టీఆర్ కోసం ‘పూజా స్పెషల్ జర్నీ’!
X

ఎన్టీఆర్, పూజా హెగ్డెలు జంటగా నటిస్తున్న సినిమా ‘అరవింద సమేత రాఘవ’. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇటీవలే ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ ఆకస్మిక మృతితో సినిమా షూటింగ్ కు ఒకింత బ్రేక్ వచ్చింది. దీంతో పూజా హెగ్డె షెడ్యూల్ లో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. ఎన్టీఆర్ కూడా బాధను దిగమింగుకుని గత శనివారం నుంచే షూటింగ్ కు కూడా హాజరవుతున్నారు. అయితే పూజా హెగ్డె హౌస్ ఫుల్ 4 సినిమా షూటింగ్ లో పాల్గొంటారు. ఇది రాజస్థాన్ లోని జై సల్మేర్ లో నడుస్తోంది. అక్కడ నుంచే మళ్లీ హైదరాబాద్ లో జరిగే అరవింద సినిమా షూటింగ్ కు కూడా వచ్చేస్తున్నారు. అయితే దీని కోసం ఆమె ‘ప్రత్యేక విమానం’ వాడుతున్నట్లు టాలీవుడ్ టాక్. అయితే లక్షల్లో అయ్యే ఈ బిల్లు ఎవరు చెల్లిస్తున్నారనే దానిపై క్లారిటీ లేదు.

ఓ హీరోయిన్ ఇలా ఇఛ్చిన తేదీలను సర్దుబాటు చేయటం కోసం ప్రత్యేక విమానం వాడటం అనేది ఆసక్తికర అంశమే. సినిమాల్లో స్పెషల్ ప్లైట్స్ వాడిన సందర్బాలు ఎన్నో. అయితే హీరోయిన్ పూజా హెగ్డె మాత్రం రెండు సినిమాల షూటింగ్ లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇలా ‘స్పెషల్ జర్నీ’ చేస్తున్నారు. పూజా టాలీవుడ్ లో టాప్ హీరోలందరితో వరస పెట్టి సినిమాలు చేస్తోంది. ఓ వైపు ఎన్టీఆర్ తో అరవింద సమేత రాఘవతో నటిస్తుండగా..మహేష్ బాబు ‘మహర్షి’లోనూ ఈ భామ హీరోయిన్ గా చేస్తోంది. తాజాగా ప్రారంభం అయిన ప్రభాస్ సినిమాలోనూ పూజానే హీరోయిన్.

Next Story
Share it