Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

చంద్రబాబును చూసి ‘మొక్కలూ సిగ్గుపడతాయ్’!

0

500 రూపాయల మొక్కకు 2800 రూపాయల రేటు ఫిక్స్

- Advertisement -

భవిష్యత్ లో ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు అమరావతిలో అలా తిరుగుతున్నాడని అనుకుందాం. ఆయన అలా వచ్చినప్పుడు అక్కడ ఉన్న మొక్కలు కూడా సిగ్గుతో తలవంచుకుంటాయ్. ఎందుకు అంటారా?. మొక్కల పేరు చెప్పి కూడా అడ్డగోలుగా దోచుకుంటున్న చంద్రబాబు సర్కారులోని అధికారుల తీరు చూసి. ముఖ్యమంత్రి అండ్ కో అడ్డగోలు టెండర్ల పేరుతో భారీగా దోచుకుంటుంటే…మేం కనీసం మొక్కల్లో కూడా తినొద్దా అని అధికారులు అనుకున్నట్లు ఉన్నారు. అందుకే అడ్డగోలుగా దోపిడీకి బరితెగిస్తున్నారు. ఈ వ్యవహారం చూసిన అధికారులు కూడా నిజంగా ఇది సిగ్గుపడాల్సిన అంశమే అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. నూతన రాజధాని కోసం అని ఏర్పాటు చూసిన అమరావతి డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏడీసీఎల్) అధికారుల అవినీతి అంతు లేకుండా సాగుతోంది. తాజాగా ఏడీసీఎల్ ఆరు వేల మొక్కల కొనుగోలుకు టెండర్ పిలిచింది. దీని కోసం 1.68 కోట్ల రూపాయల విలువ అంచనా వేసింది. మొత్తం ఆరు వేల మొక్కలను సేకరించాలని నిర్ణయించింది. ఇంత వరకూ ఓకే. కానీ అసలు కథ ఏంటి అంటే ఈ దేవగన్నేరు (Plumeria) మొక్కల ధర ఆన్ లైన్ లోనే కనిష్టం 215 రూపాయలు అయితే..గరిష్టం 499 రూపాయలు.

కానీ ఘనత వహించిన ఏడీసీఎల్ ఈ మొక్కలకు ఎంత ధర నిర్ణయించిందో తెలుసా?. అక్షరాలా 2800 రూపాయలు. ఆన్ లైన్ లో ఒక్కో మొత్తం 500 దొరుకుతుంటే సర్కారు 2800 రూపాయలు చెల్లించటానికి రెడీ అయింది అంటే..దీన్ని ఏమంటారు?. ఓ వైపు పెద్ద పెద్ద పనుల్లో వందల కోట్ల రూపాయలు దోచుకుంటూ చివరకూ మొక్కల్లోనూ కక్కుర్తి పడాలా?. అమరావతి డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ లక్ష్మీపార్థసారధిపైనా గతంలోనే  తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇంతకు ముందు కూడా మొక్కల పేరుతో ఇక్కడ జరుగుతున్న దోపిడీ చూసి భయంతో ఓ రిటైర్డ్ ఐఎఫ్ఎస్  అధికారి  నెలకు లక్ష రూపాయల జీతాన్ని కూడా వదులుకుని వెళ్ళిపోయారు. అయినా అక్కడ దోపిడీ అలాగే కొనసాగుతునే ఉంది. మా అవినీతికి ఆధారాలు చూపండి అని ప్రశ్నించే పెద్ద నిప్పు చంద్రబాబు. చిన్న నిప్పు లోకేష్ లు దీనికి ఏమి సమాధానం చెబుతారు?.

 

 

Leave A Reply

Your email address will not be published.