Telugu Gateway
Cinema

ఎన్టీఆర్ సినిమాలో హీరో చంద్రబాబా!

ఎన్టీఆర్ సినిమాలో హీరో చంద్రబాబా!
X

ఈ లుక్ చూస్తే ఎవరికైనా అదే డౌట్ వస్తుంది. ఎన్టీఆర్ బాధ్యతలు అన్నీ చంద్రబాబునాయుడే తన భుజస్కందాలపై మోసినట్లు కన్పిస్తుంది కదా?. ఎన్టీఆర్ బయోపిక్ దర్శకుడు జాగర్లమూడి క్రిష్ ఈ చిత్రం ద్వారా ఏమి చెప్పదలిచారు అన్నది ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ మారింది. ఎన్టీఆర్ పై బయోపిక్ అనగానే ఓ సంచలనం. ఈ సినిమా ప్రారంభం ఎలా ఉన్నా..ముగింపు ఎక్కడ అన్నదే ఈ సినిమాకు కీలకం కానుంది. ఎందుకంటే ఎన్టీఆర్ ను పదవీచ్యుతిడిని చేసే సన్నివేశాలు ఏమీ ఈ సినిమాలో ఉండవనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించి అతి తక్కువ సమయంలో ఎన్టీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టడంతోనే సినిమా ముగుస్తుందనే అభిప్రాయం ఎక్కువగా ఉంది. అయితే సినిమా విడుదల అయితే కానీ వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం లేదు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర పోషిస్తున్న బాలకృష్ణ టీడీపీ ఎమ్మెల్యేగా ఉండగా, ఆయన అల్లుడు నారా లోకేష్ మంత్రిగా ఉన్నారు. ఈ తరుణంలో ఎన్టీఆర్, చంద్రబాబుల మధ్య చివరిలో జరిగిన పరిణామాలు వంటి వివాదస్పద అంశాల జోలికి వెళ్లే అవకాశం ఉండదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే ఎన్టీఆర్ బాధ్యతను అంతా చంద్రబాబునాయుడే తన భుజస్కందాలపై మోసినట్లు చూపిస్తూ తాజాగా విడుదల చేసి లుక్ రాజకీయంగా విమర్శలు ఎదుర్కోవటం ఖాయంగా కన్పిస్తుంది. ఎందుకంటే ఎన్టీఆర్ చంద్రబాబు భుజంపై చేయి వేసి ఎంతో అప్యాయంగా మాట్లాడుతున్నట్లు ఉంది. అసలు ఎన్నికల సీజన్. సినిమాలో ఏమి చూపించినా చూపించకపోయినా ఎన్టీఆర్ కు జరిగిన అవమానాలు అన్నీ ప్రజలకు తెలిసినవే?. మరి వాటిని యధాతధంగా చూపిస్తారా? లేక ‘సెన్సార్’ చేస్తారా? అన్నది వేచిచూడాల్సిందే.

Next Story
Share it