Telugu Gateway
Cinema

రవితేజకు జోడీగా నభా నటేష్

రవితేజకు జోడీగా నభా నటేష్
X

‘నన్ను దోచుకుందువటే’ సినిమాలో భయ్యా....భయ్యా అంటూ సందడి చేసిన భామ నభా నటేష్. ఈ సినిమాలో ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. డైలాగ్ డెలివరీతో పాటు అభినయం కూడా ఆకట్టుకుంది. ఈ సినిమా విడుదల వెంటనే టాలీవుడ్ లో నభా నటేష్ కు వరస పెట్టి అవకాశాలు వచ్చేయటం ఖాయం అనే అభిప్రాయం వచ్చేసింది చాలా మందిలో. అందుకు అనుగుణంగా ఈ హీరోయిన్ కు మరో ఛాన్స్ వచ్చేసింది కూడా. అదీ రవితేజ సరసన నభా నటేష్ కొత్త సినిమా చేయబోతోంది. వి ఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాలో నభా రవితేజతో ఆడిపాడనుంది. ఈ సినిమాకు ‘డిస్కోరాజా’ పేరు పరిశీలిస్తున్నట్లు టాక్.

Next Story
Share it