Telugu Gateway
Offbeat

ముంబయ్-గోవా క్రూయిజ్ లో ‘డిస్కోథెక్’

ముంబయ్-గోవా క్రూయిజ్ లో ‘డిస్కోథెక్’
X

భారత్ లోని పర్యాటలకు కొత్త అనుభూతి అందుబాటులోకి రానుంది. ముంబయ్-గోవా క్రూయిజ్ లో పర్యాటకులు ఇష్టపడే పలు సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. అక్టోబర్ 11 నుంచి సర్వీసులు ప్రారంభించనున్న ఈ లగ్జరీ క్రూయిజ్ లో డిస్కోథెక్ తో పాటు పూల్ సౌకర్యం కూడా కల్పించనున్నారు. అంతే కాదు..24 గంటల కాఫీ షాప్స్ అందుబాటులో ఉంటాయి. ముంబయ్-గోవా మధ్య క్రూయిజ్ ప్రయాణ సమయం 15 గంటల పాటు ఉంటుంది. అయితే ఈ క్రూయిజ్ ప్రయాణానికి ఒక్కో వ్యక్తి 7000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే భోజనంతో పాటు టిఫిన్ అన్నీ ఉచితంగానే సరఫరా చేస్తారు.

అయితే విమాన ఛార్జీత పోలిస్తే క్రూయిజ్ ప్రయాణ టిక్కెట్ చాలా ఎక్కువగా ఉండటంతో వ్యవధి కూడా చాలా ఎక్కువగా ఉంది. అయితే క్రూయిజ్ ప్రయాణాన్ని ఆస్వాదించాలనుకునే వారికి ఇది ఓ అందమైన అనుభూతిని మిగుల్చుతుందని చెబుతున్నారు. ముంబయ్ పోర్టు ట్రస్ట్ ఛైర్మన్ సంజయ్ భాటియా ఈ లగ్జరీ క్రూయిజ్ వివరాలు వెల్లడించారు. మరి ఈ కొత్త సర్వీసులు పర్యాటకులను ఏ మేరకు ఆకర్షిస్తుందో వేచిచూడాల్సిందే. దేశంలో ఒక్క గోవాలోనే ‘క్యాసినో’లు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వారాంతాల్లో ముంబయ్ నుంచి భారీ ఎత్తున పర్యాటకులు గోవాకు వెళుతుంటారు.

Next Story
Share it