Telugu Gateway
Telangana

మోడీని ఇస్తవా..చస్తవా అని అడిగా

మోడీని ఇస్తవా..చస్తవా అని అడిగా
X

‘తెలంగాణకు కొత్త జోన్ల విషయంలో ప్రధాని నరేంద్రమోడీ ఏదో ఊగిసలాడుతున్నాడు. చేస్తవా...చస్తవా అని మోడీని అడిగా. టీఆర్ఎస్ ప్రభుత్వమే లేకపోతే...కెసీఆర్ లేకపోతే ఇది సాధ్యమయ్యేదా?. 95 శాతం మన యువతకే ఉద్యోగాలు సాధ్యమయ్యేవా? అని సీఎం కెసీఆర్ కొంగరకలాన్ బహిరంగ సభలో వ్యాఖ్యానించారు. తెలంగాణలో అభివృద్ధి సాగుతుంటే కొంత మంది ప్రాజెక్టులపై కేసులు వేసి అడ్డంకులు సృష్టిస్తున్నారు. వాళ్ళ స్వార్ధ రాజకీయం కోసం అవాకులు..చెవాకులు పేలుతున్నారు. మోసపోతే గోసపడతాం..ఈ వేదిక ద్వారా విజ్ణప్తి చేస్తున్నాం. కొన్ని పార్టీలు ఢిల్లీకి గులాంలుగా ఉంటాం అని చెబుతున్నాయి. తెలంగాణ నిర్ణయాధికారం తెలంగాణకు ఉండాలా? ఢిల్లీ పాలకుల చేతిలో ఉండాలా?. అసెంబ్లీ టిక్కెట్ల కోసం కూడా వాళ్ళు కాపలా కాయాలి. గులాంగురీ చేయాలి. మనకు మనమే ఉండాలి. ఢిల్లీకి మనం బానిసలు కావద్దు అని మనవి చేస్తున్నా. తెలంగాణలో భవిష్యత్ బ్రహ్మాండంగా ఉండాలి. సంక్షేమం మరింత పెరగాలి. ఆదాయం పెంచుకుందాం. పెన్షన్లు మరింత పెంచుతాం.నిరుద్యోగ సోదరుల గురించి కూడా ఆలోచన చేద్దాం. ముందస్తు ఎన్నికలపై ఏది మంచో...నిర్ణయం తీసుకోమని నాకు అప్పగించారు. రాబోయే రోజుల్లో..భవిష్యత్ లో మీరు చూడబోతారు. కొంత మంది కెసీఆర్ ను ఓడించటమే లక్ష్యం అని చెబుతున్నారు. ఇదేమి దిక్కుమాలని లక్ష్యం. ఏ పార్టీ అయినా తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏమి చేస్తామో చెప్పాలి. కానీ ఇవేమి దిక్కుమాలిన లక్ష్యాలు.

బహిరంగ సభలో కొత్త పథకాలు ప్రకటిస్తారు అని మీడియా వాళ్లు రాశారు. ఇది తప్పు. కేశవరావు నేతృత్వంలో మేనిఫెస్టో కమిటీ వేస్తాం. తిరిగొస్తే ఏమి చేస్తామో అందులో చెబుతాం. తెలంగాణ ప్రజలు కూడా మళ్లీ కెసీఆర్ రావాలే..టీఆర్ఎస్ రావాలే అని కోరుకుంటున్నారు. ఈ సభ చూస్తుంటే..జనమా..ప్రభంజనమా అన్న రీతిలో ఉంది. ఆకు పచ్చ తెలంగాణ చేయటమే తమ లక్ష్యమని అన్నారు. కోటి ఎకరాల నీరు త్వరలోనే సాధ్యం కానుందని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రభుత్వం రైతు బీమా, రైతుబంధు, రుణ మాఫీ పూర్తి చేశామన్నారు. మిషన్ భగీరథ..నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగను అని చెప్పా. 22 వేల గ్రామాలకు నీళ్లు లిఫ్ట్ చేయబడ్డాయి. 46 శాతం ఇంటింటికి నళ్లా పూర్తి అయింది. మిగిలినవి కూడా త్వరలోనే పూర్తవుతాయి. తాము ఓట్లు అడిగే నాటికి అన్నీ రెడీ అవుతాయని కెసీఆర్ తెలిపారు. తాము కడుపు కట్టుకుని..నోరు కట్టుకుని..పనిచేస్తున్నామని తెలిపారు. దేశంలోనే ఆదాయంలో నెంబర్ వన్ గా ఉన్నామని తెలిపారు.

Next Story
Share it