Telugu Gateway
Cinema

చిమ్మటి చీకటీ..కమ్మటి సంకటీ

చిమ్మటి చీకటీ..కమ్మటి సంకటీ
X

ఎన్టీఆర్ కొత్త సినిమా అరవింద సమేత వీరరాఘవ మ్యూజికల్ గా సూపర్ హిట్ కొట్టే అవకాశం కన్పిస్తోంది. ఇప్పటికే ఓ పాట విడుదల కాగా..బుధవారం నాడు చిత్ర యూనిట్ మరో పాటను విడుదల చేసింది. ఈ పాట కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ‘చిమ్మటి చీకటి..కమ్మటి సంకటీ. ఎర్రగా కుంపటీ..ఎచ్చగా దుప్పటీ, కొమ్మల్లో సక్కటి..కోయలే ఒక్కటీ’ అంటూ సాగే పాట ప్రేక్షకులను కదిలించేలా ఉంది. ఈ సినిమాలో చిన్నప్పుడే హీరోను తండ్రి వదిలిపెట్టి పోయిన సందర్భంలో ఈ పాట వచ్చినట్లు ‘పెనివిటి’ పాటను చూస్తే తెలుస్తోంది.

రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు సాహిత్యం అందించగా..పాటను కాలబైరవ ఆలపించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తోంది. ఈ నెల 20న పాటలన్నింటిని నేరుగా ఆన్ లైన్ లో విడుదల చేసి..తర్వాత ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేయనున్నారు. అరవింద సమేత వీరరాఘవలో ఎన్టీఆర్ కు జోడీగా పూజా హెగ్డె, ఈషా రెబ్బలు నటిస్తున్నారు.

https://www.youtube.com/watch?v=rsRSTPYxqvo

Next Story
Share it