ఆన్ లైన్ లో అరవింద సమేత ఆడియో
ఎన్టీఆర్ కొత్త సినిమా అరవింద సమేత వీరరాఘవ చిత్ర ఆడియోను నేరుగా ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ప్రకటించింది. సెప్టెంబర్ 20న పాటలు విడుదల కానున్నాయి. అరవింద సమేతలో ఎన్టీఆర్ కు జోడీగా పూజా హెగ్డె నటిస్తున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు. అయితే ఆడియోకు ఎలాంటి హంగామా లేకుండా చేసి త్వరలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ తేదీని ప్రకటించే అవకాశం ఉంది. దసరాకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కు సంబంధించి ప్రచార కార్యక్రమాల జోరు పెంచారు నిర్మాతలు. తాజాగా విడుదల చేసిన లిరికల్ సాంగ్ కు కూడా విశేష స్పందన వచ్చింది. జైలవకుశ వంటి హిట్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావటంతో దీనిపై అభిమానుల్లో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సినిమాకు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కావటంతో అందరిలోనూ ఆసక్తి మరింత పెరిగింది.