Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తే అసెంబ్లీ రద్దు చేస్తారా!

0

తెలంగాణ అసెంబ్లీ రద్దుకు సంబంధించి ఆపద్ధర్మ  ముఖ్యమంత్రి కెసీఆర్ చెప్పిన కారణం చాలా విచిత్రంగా ఉంది. గత కొంత కాలంగా తెలంగాణలో రాజకీయ అసహన..అతి ప్రవర్తన పెరిగిపోయిందని..దీని వల్ల ప్రగతి ఆగిపోయే అవకాశం ఉందని..అందుకే ప్రజల వద్దకు వెళ్లి తేల్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. చేస్తే.గీస్తే త్యాగం తాము చేస్తున్నామని..ఎవరు చేస్తున్నారని ప్రశ్నించారు. తొమ్మిది నెలల ముందు ఎన్నికలకు ఎందుకు వెళుతున్నది ప్రభుత్వపరంగా ెఎలాంటి కారణం చెప్పని కెసీఆర్..ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీనే  కారణం అనేలా మాట్లాడటం విశేషం. తెలంగాణ రాష్ట్రం ప్రగతిలో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని అన్నారు. ఈ ఏడాది కూడ 21.96 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని తెలిపారు. కోర్టుల్లో స్టేలు..రౌండ్ టేబుల్…స్క్వేర్ టేబుల్స్..వాళ్ల బొంద సమావేశాలు అని ప్రతిపక్షాలపై ద్వజమెత్తారు. పరిపాలన సరిగా లేకపోతే  ఇంత పెద్ద గ్రోత్ ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నించారు. తెలంగాణకు వివిధ రంగాల్లో   40 అవార్డులు వచ్చాయన్నారు. మిషన్ భగీరధ పెడితే దానికి కమిషన్లు అంటారు.

- Advertisement -

మిషన్ కాకతీయ అంటే దానికి కమిషన్లు అన్నారు. ఒక్కటన్నా ఆధారం. రుజువు చేయాలి కదా?. నోరుంది కదా? ప్రజాస్వామ్యం.  పేపర్లు రాస్తాయి అని చెప్పి…గత ఆర్థిక సంవత్సరంలో నీటిపారుదల రంగంపై  చేసిన ఖర్చు 25 వేల కోట్లు. ఎంత నిబద్ధత పనిచేస్తే కరంట్ బాగు అయింది.. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది మరింత విచ్చలవిడి ఆరోపణలు చేస్తున్నారు. అధికారులు కూడా స్థైర్యం కోల్పోయే పరిస్థితి. ఈ ఆర్థిక ప్రగతి ఆగకూడదు. పదవులు వదులుకున్న ఎమ్మెల్యేలకు నా శాల్యూట్. మినిస్టర్స్..ఎంపీలకు శాల్యూట్. నా తరపున అందరికీ ధన్యవాదాలు చెబుతున్నా. రాష్ట్రం అవినీతి..అసమర్దుల చేతికి వెళితే..ఇంత పట్టు మీద..ప్రగతి జరగదు. ఇవి ముందస్తు ఎన్నికలు  కాదు.

కెసీఆర్ ఏమి చేసినా తెలంగాణ మేలు కోసం చేస్తాడు తప్ప..చెడు కోసం చేయడు. 99 శాతం మేనిఫెస్టోలో పెట్టినవి అమలుచేశాం. రాష్ట్రానికి పెద్ద దరిద్రం..విలన్ కాంగ్రెస్.ఉన్న తెలంగాణ పొగొట్టింది నెహ్రు. మరో నియంత ఇందిరా గాంధీ. ఈ దరిద్రానికి రిజర్వ్ బ్యాంక్ కాంగ్రెస్. కాంగ్రెస్ పీడ పోవాలి. మీ దరిద్రం పోవాలి. కెసీఆర్ పీడ కాదు. తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో కర్ఫూలు లేవు…కుంభకోణాలు లేవు. ప్రజలకు ఎవరు తీర్పు ఇస్తారో వారే పరిపాలించుకుంటారు. 50 రోజుల్లో వంద సభలు పెడతాం అని తెలిపారు.

 

Leave A Reply

Your email address will not be published.