Telugu Gateway
Politics

బిజెపి కీలక నిర్ణయం..మళ్ళీ మోడీనే!

బిజెపి కీలక నిర్ణయం..మళ్ళీ మోడీనే!
X

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బిజెపికి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజారిటీ వస్తుందా?. బిజెపి నేతలు కూడా ఆ ఛాన్స్ లేదని తేల్చేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో బిజెపికి గట్టి దెబ్బతగలనుంది. దీనికి తోడు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్ ల్లో కూడా బిజెపి దారుణ పరాజయాన్ని చవిచూసే అవకాశం ఉందని సర్వే నివేదికలు వస్తున్నాయి. బీహర్ లో జెడీయూతో పొత్తు కూడా మళ్ళీ సంకటంలో పడింది. విపక్షాలు అన్నీ ఎలాగైనా మోడీని ఇంటిదారి పట్టించాలనే పట్టుదలతో ఉన్నాయి. అయితే వాటికి పరిస్థితులు అనుకూలిస్తాయా?. బిజెపినే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తే పరిస్థితి ఏంటి?. అనే అంశాలపై బిజెపి ఇప్పటి నుంచే తర్జనభర్జనలు ప్రారంభించింది. ఏది ఏమైనా మోడీనే మా నేత అంటూ బిజెపి ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కావాల్సిన మెజారిటీ కంటే తక్కువ సీట్లు వస్తే..ఇతర పార్టీల మద్దతు దక్కించుకునేందుకు మోడీ స్థానంలో గడ్కరీ, రాజ్ నాధ్ సింగ్ వంటి వారిని తెరపైకి తెస్తారనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. అయితే ఇదంతా కేవలం ప్రచారం మాత్రమే అని..బిజెపి ముఖ్యులు..ఆర్ఎస్ఎస్ కూడా ఇందుకు సిద్ధంగా లేదనే అంశం ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చింది.

మరి మోడీ సొంతంగా మెజారిటీ దక్కించుకునే పరిస్థితి ఉందా? అంటే అదీ లేదనే చెప్పొచ్చు. చూస్తుంటే వచ్చే ఎన్నికల తర్వాత జాతీయ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారే సూచనలు కన్పిస్తున్నాయి. విచిత్రం ఏమిటంటే ఇప్పటికైతే ప్రదాని అభ్యర్దులుగా మోడీ, రాహుల్ గాంధీలను పోల్చిచూస్తే ఎక్కువ శాతం దేశ ప్రజలు మోడీవైపు మొగ్గుచూపుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ రాఫెల్ డీల్ ను భారీ ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఈ ప్రయత్నాలు ఏ మేరకు పలితాన్ని ఇస్తాయో వేచిచూడాల్సిందే. పలు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు కూడా మోడీని ఎలాగైనా దెబ్బకొట్టాలనే లక్ష్యంతో ఉన్నాయి. అందుకే అన్నీ కలసి జట్టుకట్టే ప్రయత్నాల్లు చేస్తున్నాయి.

Next Story
Share it