Telugu Gateway
Telangana

రేవంత్ రెడ్డి దేశద్రోహి

రేవంత్ రెడ్డి దేశద్రోహి
X

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎంపీ బాల్కసుమన్ ధ్వజమెత్తారు. ఆయన ఏకంగా రేవంత్ రెడ్డిని దేశద్రోహిగా అభివర్ణించారు. డొల్ల కంపెనీలతో అడ్డగోలుగా అవినీతి చేసిన రేవంత్ రెడ్డిని ఎన్నికల్లో పోటీచేయకుండా అనర్హత వేటు వేయాలని ఎన్నికల సంఘాన్ని కోరతామని అన్నారు. ఐటి శాఖ అధికారుల ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పటంలేదన్నారు. జానా రెడ్డి 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు.. వారిపైన ఐటి సోదాలు జరగటం లేదు కదా? అని ప్రశ్నించారు. తెలంగాణ తులసి వనం లో రేవంత్ రెడ్డి గంజాయి మొక్క అని వ్యాఖ్యానించారు. సెటిల్మెంట్ లు, భూ కబ్జా లకు కేరాఫ్ ఆడ్రస్ రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. ఒకే అడ్రస్ పై 18 కంపెనీలు పెట్టీ అక్రమ వ్యాపారాలు చేయటం న్యాయమా.. కాంగ్రెస్ నేతలు చెప్పాలి అని ప్రశ్నించారు. 14కోట్ల రూపాయల ఒక యంత్రం చేతులు మారి.. ఒక కంపెనీ 80 కోట్ల కు దాన్ని కొనడం అంటే ఏంటీ.. ?ఈ కంపెనీ ఇచ్చిన గిఫ్ట్ కారులోనే రేవంత్ తిరుగుతున్నాడు.

తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ నేతలు వాస్తవాలు చెప్పాలి. .రేవంత్ రెడ్డి ఒక చోటా షకీల్, ఒక విజయ మాల్య, ఒక దావూద్ ఇబ్రహీం. 2009 ఎలక్షన్ అఫిడవిట్ లో 3.6 కోట్లు, 2014 లో అఫిడవిట్ 13.2 కోట్లు చూపించారు . ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి. రేవంత్ రెడ్డి అసలు ఈ సమాజం లో వుండటం కరెక్ట్ కాదు. చంద్రబాబు తో కలిసి రేవంత్ రెడ్డి ఈ వ్యవహారాలు నడిపించాడు. ఓటు కు నోటు కేస్ లో దొరికిన 50 లక్షల రూపాయలు ఎక్కడినుంచి వచ్చాయి అనేది ఆరా తీస్తే డొంక కదిలింది. నారాయణ గూడ లో మామూలు పెయింటర్ రేవంత్ రెడ్డి ఇన్ని కోట్లు ఎలా సంపాదించా రో ప్రజలకు చెప్పాలి. మిలట్రీ లో పని చేసిన ఉత్తమ్ మని లాండరింగ్ చేసిన రేవంత్ కి ఎలా మద్దతు తెలుపుతారు? అని ప్రశ్నించారు.

Next Story
Share it