Telugu Gateway
Cinema

పాటల షూటింగ్ లో ‘అరవింద టీమ్’

పాటల షూటింగ్ లో ‘అరవింద టీమ్’
X

అరవింద సమేత వీరరాఘవ టీమ్ ప్రస్తుతం విదేశాల్లో పాటల చిత్రీకరణలో బిజీగా ఉంది. ఈ పాటల చిత్రీకరణ పూర్తయితే సినిమా పూర్తయిపోయినట్లే. ఈ సినిమాలోని ఓ పాటను చిత్రీకరించడం కోసం స్విస్‌–ఇటాలియన్‌ బోర్డర్‌ వెళ్లారు చిత్ర బృందం. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా పూజా హెగ్డె నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాలోని పలు పాటలు విడుదలై ఆకట్టుకుంటున్నాయి. విదేశాల్లో పాట చిత్రీకరణ ఆదివారం నుంచి ప్రారంభం కానుందని సమాచారం.

అయితే విదేశాల్లో మొత్తం ఎన్ని పాటలు చిత్రీకరిస్తున్నారనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల మొదటి వారంలో సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఉండే అవకాశం ఉంది. ఆడియోను ఆన్ లైన్ లోనే నేరుగా విడుదల చేశారు. అరవింద సమేత వీరరాఘవ సినిమాను అక్టోబర్‌ 11న విడుదల చేయనున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

Next Story
Share it