ఎన్టీఆర్ మాట వింటాడట!

అవును. ఈ మాట చెబుతున్నది ఆయన హీరోయిన్ పూజా హెగ్డె. చూడ్డానికి టఫ్ గా కన్పించినా మాట వింటాడు అని ఓ సర్టిఫికెట్ అయితే ఇచ్చేసింది ఈ భామ. ఈ సర్టిఫికెట్ ను ఎన్టీఆర్ కూడా అంతే మెలికలు తిరుగుతూ యాక్సెప్ట్ కూడా చేసినట్లే కన్పిస్తున్నాడు. ఇదంతా ఎక్కడ అంటారా?. అరవింద సమేత వీరరాఘవ సినిమాకు సంబంధించి విడుదలైన తొలి లిరికల్ సాంగ్ లోని వ్యవహారం.
ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. హారికా హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై యస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. పాటల షూటింగ్ మినహా టాకీ పార్ట్ కంప్లీట్ అయింది. ఈ సినిమాలో ఫస్ట్ టైమ్ పూజా హెగ్డే తన పాత్రకు సొంత డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. దసరాకు సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
https://www.youtube.com/watch?v=mR1z_nbfP58