Telugu Gateway
Cinema

అక్కినేనిగా ‘సుమంత్’ సూపర్

అక్కినేనిగా ‘సుమంత్’ సూపర్
X

ఒక్కో పాత్రకు..ఒక్కో చరిత్ర ఉంది. చారిత్రక సినిమా అంటే ఆషామాషీ కాదుగా మరి. దీనికి ఎంతో కసరత్తు చేయాలి. జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ మాత్రం తేడా వచ్చినా మొదటికే మోసం వస్తుంది. అందుకే దర్శకుడు క్రిష్ పాత్రలకు క్యారెక్టర్ల ఎంపికతో పాటు..వారి మేకప్..గెటప్ ల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రానాను అచ్చం చంద్రబాబులా మార్చేసిన దర్శకుడు..ఇప్పుడు సుమంత్ ను అక్కినేని నాగేశ్వరరావుగా తీర్చిదిద్దారు. అక్కినేని జయంతిని పురస్కరించుకుని టాలీవుడ్‌ ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తోంది.

ఏఎన్నార్‌కు నివాళులర్పిస్తూ ఎన్టీఆర్ బయోపిక్ చిత్ర యూనిట్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ బయోపిక్‌లో ఏఎన్నార్‌ పాత్రలో నటిస్తున్న ఆయన మనవడు సుమంత్ లుక్‌ను విడుదల చేశారు. ఇది ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఎన్టీఆర్‌ సినీ రాజకీయ ప్రస్థానాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నారా చంద్రబాబు నాయుడు పాత్రలో యంగ్‌ హీరో రానా నటిస్తుండగా ఎన్టీఆర్‌ సతీమణి బసవతారకంగా బాలీవుడ్ నటి విద్యాబాలన్‌ కనిపించనున్నారు. అత్యంత కీలకమైన ఎన్టీఆర్ పాత్రను ఆయన తనయుడు బాలకృష్ణ పోషిస్తున్నారు.

Next Story
Share it