Telugu Gateway
Cinema

విజయ్ దేవరకొండకు షాక్

విజయ్ దేవరకొండకు షాక్
X

టాలీవుడ్ లో వరస పెట్టి హిట్లు కొడుతున్న విజయ్ దేవరకొండకు ఊహించని షాక్. ఆయన తాజా సినిమా గీత గోవిందం లీక్ బారిన పడినా సక్సెస్ బాటలో పయనిస్తోంది. ఇప్పుడు అదే హీరోకు చెందిన మరో కొత్త సినిమా ‘ట్యాక్సీవాలా’దీ కూడా ఇదే పరిస్థితి. ఏకంగా సినిమా హెచ్ డీ ప్రింట్ ను కొంత మంది నెట్ లో అప్ లోడ్ చేశారు. అది కూడా ఎడిటింగ్ కాని ప్రింట్ బయటకు వచ్చేసింది. దీంతో షాక్ కు గురైన చిత్ర నిర్మాతలు పోలీసులను ఆశ్రయించారు. నిర్మాణ సంస్థ ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

విజయ్ హీరోగా ట్యాక్సీవాలా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను వచ్చే నెలలో విడుదల చేసే సన్నాహాల్లో చిత్ర యూనిట్ ఉండగా..ఇప్పుడు ఈ లీక్ పెద్ద దుమారం రేపుతోంది. తాజాగా మెగా స్టార్ చిరంజీవి కోట్లాది రూపాయలు వెచ్చించి పెట్టి తీసే సినిమాలను ఇలా లీక్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చిరించారు. అయినా లీక్ రాయుళ్ళు అదేమీ పట్టించుకోలేదు. ఈ సినిమా ప్రింట్ ను ఏకంగా యూట్యూబ్ తోపాటు ఫేస్ బుక్, ట్విట్టర్ ల్లో అప్ లోడ్ చేశారు.

Next Story
Share it