Telugu Gateway
Telangana

కాంగ్రెస్ వైపు చంద్రబాబు...బిజెపివైపు కెసీఆర్

కాంగ్రెస్ వైపు చంద్రబాబు...బిజెపివైపు కెసీఆర్
X

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక పలు అంశాలపై క్లారిటీ ఇచ్చేసింది. ఈ ఎన్నిక ద్వారా ఎవరు ఎటువైపు ఉన్నారో స్పష్టంగా తేలిపోయినట్లు అయింది. ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన తెలుగుదేశం పార్టీ రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధి హరిప్రసాద్ కు ఓటు వేసింది. గత కొంత కాలంగా ఎన్డీయేతో విభేదిస్తున్న టీడీపీ క్రమక్రమంగా కాంగ్రెస్ కు దగ్గర అవుతూ వస్తోంది. కొద్ది రోజుల నుంచి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాంగ్రెస్ పై ప్రశంసల వర్షం కురిపిస్తూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ తెలంగాణతో పాటు ఏపీలో కూడా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునేందుకు రెడీ అవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అందుకు అనుగుణంగానే అన్నట్లు రాజ్యసభలో ఆ పార్టీ తీరు ఉంది. అయితే కొద్ది రోజుల క్రితం అసలు బిజెపి, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ పెట్టి దేశానికి దశ..దిశా చూపిస్తానని ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ బిజెపికి దగ్గర అయినట్లు ఈ ఎన్నికతో స్పష్టంగా తేలిపోయింది.

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక విషయంలోనూ అదే స్పష్టమైంది. ఎన్డీయే బలపర్చిన అభ్యర్ధికే టీఆర్ఎస్ సభ్యులు ఓటు వేశారు. దీంతో కెసీఆర్ ఎటువైపు ఉన్నది స్పష్టమైపోయిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. భవిష్యత్ రాజకీయాలకు ఇవి సంకేతాలకు నిలిచే అవకాశం ఉందని భావిస్తున్నారు. హరివంశ్ నారాయణ్ జెడీయూ ఎంపీ అయిన అధికార ఎన్డీయే బలపర్చిన అభ్యర్ధి కావటంతో బిజెపికి మద్దతు ఇచ్చినట్లు అయింది. సో..తెలుగు రాష్ట్రాలకు చెందిన టీడీపీ కాంగ్రెస్ తో జట్టుకట్టగా, టీఆర్ఎస్ బిజెపితో కలసినట్లు అయింది. సో...టీఆర్ఎస్ మద్దతు ఇఛ్చిన అభ్యర్ధి గెలిస్తే..టీడీపీ మద్దతు ఇఛ్చిన అభ్యర్ధి పరాజయం పాలయ్యారు.

Next Story
Share it