Telugu Gateway
Andhra Pradesh

నవయుగా డైరక్టర్ శశిధర్ కంపెనీ ఖాతాల్లో మతలబు ఏమిటో !

నవయుగా డైరక్టర్ శశిధర్ కంపెనీ ఖాతాల్లో మతలబు ఏమిటో !
X

ఎన్ఈసీ రియల్ ఖాతాల నుంచి నిధుల బదిలీ ఎవరికి?

విచారణ జరుపుతున్న ఆర్ వోసీ..ఎస్ఎఫ్ఐఓ!

ఎన్ ఈసీ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీలో డైరక్టర్లు చింతా శశిధర్, కుముద కుమార్ బాబు, సాయి సుధా చింతా. చింతా శశిధర్ నవయుగా గ్రూప్ అధినేత విశ్వేశ్వరావు తనయుడు, ఆ గ్రూపు సంస్థల్లో డైరక్టర్ కూడా. తాజాగా ఆర్ వోసీ అధికారులు నవయుగా గ్రూప్ నకు చెందిన పలు కంపెనీల రికార్డులను తనిఖీ చేశారు. ఒకే అడ్రస్ లో నలభైకి పైగా కంపెనీలు ఉన్నట్లు గుర్తించి...అసలు ఈ కంపెనీలు ఏమి చేస్తున్నాయి..ఎలాంటి లావాదేవీలు నిర్వహిస్తున్నాయి అనే విషయాలను పరిశీలించారు. అయితే ఇందులో ముఖ్యంగా చింతా శశిధర్ డైరక్టర్ గా ఉన్న ఎన్ ఈ సీ రియల్ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతాల్లో అసాధారణ లావాదేవీలు జరిగాయనే అంశాన్ని సంబంధిత అధికారులు గుర్తించారు. దీంతో ఈ సంస్థపై విచారణ జరపాలని నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. చాలా కాలం పాటు అసలు ఈ సంస్థలో ఎలాంటి లావాదేవీలు జరగలేదని..కానీ సడన్ గా గత ఆర్థిక సంవత్సరంలో కోట్లాది రూపాయలు ఈ కంపెనీ ఖాతాల్లోకి రావటం..మళ్లీ వెంటనే అవి బయటకు వెళ్లిపోవటం జరిగాయని గుర్తించినట్లు సమాచారం. అయితే ఆ నిధులు ఎక్కడ నుంచి వచ్చాయి...ఎవరి ఖాతాల్లోకి వెళ్లాయనే అంశాన్ని ఆర్ వోసీ, ఎస్ఎఫ్ఐవో అధికారులు పరిశీలించనున్నారు.

చింతా శశిధర్ డైరక్టర్ గా ఉన్న నవయుగా గ్రూప్ కంపెనీలు అటు ఆంధ్రప్రదేశ్ తోపాటు ఇటు తెలంగాణలో వేలాది కోట్ల రూపాయల పనులు చేస్తున్న సంగతి తెలిసిందే. నవయుగాకు చెందిన సంస్థ పోలవరం ప్రాజెక్టులో కోట్లాది రూపాయల పనులను పాత రేట్లకే చేసేందుకు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే రేట్లు పెంచకపోతే ఏ కాంట్రాక్టర్ అయినా ఎందుకు ముందుకొస్తాడని వ్యాఖ్యానించినాగా...ఎవరూ ఊహించని రీతిలో నవయుగ ముందుకొచ్చింది. వందల కోట్ల రూపాయల పనులను ఏ సంస్థ అయినా నష్టానికి ఎందుకు చేస్తుంది అన్నది ఎవరి మదిలో అయినా మెదిలే ప్రశ్న?. దీని వెనక ఏమైనా కారణాలు ఉన్నాయా?. ఈ కంపెనీ లావాదేవీల వెనక ఉన్న మతలబు ఏమిటి? అన్న అంశాలపై విచారణ సాగనుంది. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ తీవ్రంగా విభేదించిన ఇదే సంస్థకు ఇఫ్పుడు ఏపీలో భారీ ఎత్తున వేలాది కోట్ల రూపాయల ప్రాజెక్టులను కట్టబెట్టడం విశేషం. ఆర్వోసీ, ఎస్ఎఫ్ఐవో అధికారుల విచారణలోనే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని..అప్పటి వరకూ ఏమీ చెప్పటం సాధ్యంకాదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

Next Story
Share it