శైలజారెడ్డి అల్లుడు ట్రైలర్ వచ్చేసింది

అక్కినేని నాగచైతన్య జోరు పెంచారు. తన కొత్త సినిమా శైలజారెడ్డి అల్లుడు విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల జోరు పెంచింది చిత్ర యూనిట్. అందులో భాగంగానే సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో నాగచైతన్యకు జోడీగా అను ఇమాన్యుయల్, అత్తగా రమ్యకృష్ణ నటిస్తున్న సంగతి తెలిసిందే. మారుతి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ మధ్య కాలంలో మారుతి సినిమాలు అన్నీ హిట్ ట్రాక్ లోనే నడుస్తున్నాయి. కామెడీకే పరిమితం కాకుండా విభిన్నమైన కథ, పంచ్ డైలాగ్స్, ట్విస్ట్‌లతో ఆకట్టుకునే మారుతి ఈ చిత్ర ట్రైలర్‌లోనూ తన మార్క్ కనిపంచేలా చేశాడు.
వెన్నెల కిషోర్, పృథ్వీ కామెడీ పంచ్‌లు నవ్వులు పండిస్తున్నాయి. ‘పొగరుతో సాధించలేనిది ప్రేమతో సాధించవచ్చు, ఆవకాయ అన్నంలో కలుపుకొని తినాలి కాని ఎర్రగా ఉంది కదా అని మొఖానికి పులుముకోవద్దు, మీలో పుచ్చకాయంత ప్రేమ ఉందా’ లాంటి కామెడీ డైలాగులు చూస్తుంటే సినిమా చూసిన ప్రేక్షకుడు కడుపుబ్బా నవ్వుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతమందిస్తున్నారు. వినాయకచవితి కానుకగా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం రాబోతుంది.
https://www.youtube.com/watch?v=v8FEpl9QmFU