Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

‘బేబీ…అను బేబీ’ అంటున్న నాగచైతన్య

0

అక్కినేని నాగచైతన్య. అను ఇమాన్యుయల్ జంటగా నటిస్తున్న సినిమా ‘శైలజరా రెడ్డి అల్లుడు’. ఇందులో నాగచైతన్య అత్తగా రమ్యకృష్ణ నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్దం అవుతోంది. ఇప్పటికే చిత్ర యూనిట్ సినిమాను ఆగస్టు 31న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. విడుదల తేదీ దగ్గరకొస్తుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు పెంచింది. అందులో భాగంగానే ఓ పాట వీడియోను విడుదల చేశారు. అందులో బేబే..అను బేబీ అంటూ నాగచైతన్య హీరోయిన్ అను ఇమాన్యుయల్ ను ఆటపట్టించే సన్నివేశాలు సరదాగా..ఆసక్తికరంగా ఉన్నాయి.

                                       ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహించారు. ఈ పాటపై నాగచైతన్య సతీమణి సమంత వెంటనే రియాక్ట్ అయ్యారు. ఈ పాట తనకు బాగా నచ్చిందని ట్విట్టర్ లో కామెంట్ చేసి…వీడియోను కూడా షేర్ చేసుకున్నారు. దీంతో పాటు ఈ సినిమాలో ఓ ప్రత్యేక ఆకర్షణ కూడా ఉంది. అల్లరి అల్లుడు సినిమాలో నాగార్జున, రమ్యకృష్ణ జోడీగా నర్తించిన నిన్ను రోడ్డు మీద చూసింది లగాయత్తు పాట రీమేక్ చేశారు ఈ సినిమాలో.

- Advertisement -

 https://www.youtube.com/watch?v=r3eERcUHvPY

Leave A Reply

Your email address will not be published.