Telugu Gateway
Politics

కాంగ్రెస్ తో టీడీపీకి పొత్తు ఉండదు

కాంగ్రెస్ తో  టీడీపీకి  పొత్తు ఉండదు
X

ఓ వైపు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తో కలిసేందుకు వడివడిగా అడుగులు వేస్తుంటే ఆ పార్టీ సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి కె ఈ కృష్ణమూర్తి మాత్రం..అంతా తూచ్ అంటున్నారు. కాంగ్రెస్ తో అసలు టీడీపీకి పొత్తు ఉండదని ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం ఆయన టీడీపీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే ఉరేసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బిజెపి, వైసీపీ, జనసేన అందరూ తమ శత్రువులే అని ప్రకటించారు ఆయన. అంతే కాదు..చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాతే నదుల అనుసంధానం మొదలైందని అన్నారు.

Next Story
Share it