నిఖిల్ ‘ముద్ర’ రెడీ
BY Telugu Gateway10 Aug 2018 3:29 PM IST
X
Telugu Gateway10 Aug 2018 3:29 PM IST
వినూత్న చిత్రాలతో ముందుకు సాగుతూ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక ‘ముద్ర’ వేసుకుంటున్నాడు హీరో నిఖిల్. ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్ర యూనిట్. ఈ సినిమా నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ ముద్రలో నిఖిల్ కు జోడీగా లావణ్య త్రిపాఠి నటించారు. తమిళంలో హిట్ అయిన కణిథన్ మూవీకి రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో నిఖిల్ జర్నలిస్ట్ పాత్రను పోషిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా వర్కింగ్ స్టిల్స్ కు ప్రేక్షకుల దగ్గర నుంచి మంచి స్పందన వచ్చింది. నిఖిల్ తాజా సినిమా కిరాక్ పార్టీ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. మరి ఈ ముద్ర ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచిచూడాల్సిందే.
Next Story