పేరు చెప్పటానికి హైదరాబాద్ నుంచి వచ్చావా!
...‘నీవెవరో’ సినిమాలో హీరో ఆది పినిశెట్టితో వెన్నెల కిషోర్ చేసే కామెంట్ ఇది. అంతే కాదు..చిత్ర యూనిట్ విడుదల చేసిన ట్రైలర్ లో ఎన్నో సరదా సన్నివేశాలు..సంభాషణలు ఉన్నాయి. ట్రైలర్ చూస్తేనే సినిమాలో ఏదో కొత్త దనం ఉన్నట్లు కన్పించేలా కట్ చేశారు ట్రైలర్ ను. శివాజీ, తులసీ ఓ టేబుల్ దగ్గర కూర్చుని ఉంటారు. అప్పుడే అటుగా వచ్చిన హీరోయిన్ రితికా సింగ్ ను పిలిచి మరీ తులసీ బాటిల్ చూపిస్తూ మీ నాన్నగారిని ఓ సారి పిలువు అమ్మా....ఓ పెగ్గు వేసి పోతారు అంటుంది.
అంతలోనే డైలాగ్ అందుకున్న శివాజీ రాజా పెగ్గు వేస్తే నిజంగానే పోతాడు అంటారు. ఇలా ఆది..వెన్నెల కిషోర్ తో సాగే సరదా సన్నివేశాల సమ్మేళనమే ఈ ట్రైలర్. నీవెవరో సినిమాలో ఆదికి జోడీగా తాప్సీ, రితికా సింగ్ లు నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 24నే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు నిర్మాతల్లో ఒకరిగా ఉన్న కోన వెంకట్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే బాధ్యతలు కూడా నిర్వర్తించారు.
https://www.youtube.com/watch?v=7Gd9ijJFtzQ