సారీ...మిస్టర్ రాజమౌళి
ఈ మాట చెబుతున్నది ఎవరో తెలుసా?. పోసాని కృష్ణమురళీ. ఆయన రాజమౌళికి ఎందుకు సారీ చెబుతున్నారు అంటారా?. సిల్లీ ఫెలోస్ ట్రైలర్ చూస్తే కానీ మీకు క్లారిటీ రాదు ఈ విషయంలో. అల్లరి నరేష్, సునీల్ లు నటించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో భాగంగా చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల వేగం పెంచింది. ఈ సినిమా ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేసి..చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు.
భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. బ్లూ ప్లానెట్ ఎంటర్‌టైన్మెంట్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పూర్ణ, చిత్ర శుక్లాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ ట్రైలర్ లో కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి.
https://www.youtube.com/watch?v=cbMOrolIzVQ