Telugu Gateway
Cinema

‘మహర్షి’గా మారిన మహేష్ బాబు

‘మహర్షి’గా మారిన మహేష్ బాబు
X

మహేష్ బాబు ‘మహర్షి’ గా మారిపోయారు. అదే ఆయన కొత్త సినిమా టైటిల్. ప్రతిష్టాత్మక 25వ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్...టీజర్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్. పైడిపల్లి వంశీ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాలో మహేష్ బాబు ‘రిషి’గా దర్శనం ఇవ్వనున్నారు. ఆగస్టు 9 మహేష్ బాబు పుట్టిన రోజు కావటంతో ఆయన అభిమానుల కోసం ఫస్ట్ లుక్..ఆ వెంటనే టీజర్ ను విడుదల చేశారు.

కాలేజీ కుర్రాడి గెటప్ లో తొలిసారి గడ్డంతో మహేష్ ఈ సినిమాలో కన్పించనున్నారు. ఇందులో మహేష్ కు జోడీగా పూజా హెగ్డె నటిస్తోంది. టీజర్ నిడివి అతి తక్కువగా ఎలాంటి డైలాగులు లేకుండా..అలా సరదగా హీరో నడిచిపోతన్న దృశ్యాలే కన్పిస్తాయి. ఈ సినిమాను అశ్వనీదత్‌, దిల్‌ రాజు, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో అల్లరి నరేష్ ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు.

https://www.youtube.com/watch?v=vhh8pT_Ivkg

Next Story
Share it