Telugu Gateway
Telangana

కాంగ్రెస్ నేతలపై కెటీఆర్ పరుష వ్యాఖ్యలు

కాంగ్రెస్ నేతలపై కెటీఆర్ పరుష వ్యాఖ్యలు
X

తెలంగాణలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన అధికార టీఆర్ఎస్ లో బాగానే కాక రేపినట్లు కన్పిస్తోంది. గతానికి భిన్నంగా రాహుల్ అటు కేంద్రం..ఇటు రాష్ట్రంలోని అధికార పక్షాలపై చేసిన అవినీతి ఆరోపణలు ప్రజలకు కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. ఒకప్పుడు ప్రాజెక్టుల్లో జరిగే దోపిడీని అవినీతి అనేవారు..ఇప్పుడు ‘రీ డిజైన్’ అంటున్నారు అంటూ వెరైటీగా పంపాల్సిన మెసేజ్ పంపే ప్రయత్నం చేశారు. అందుకు రాహుల్ ఢిల్లీలోని రాఫెల్ కుంభకోణాన్ని..తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టుల రీడిజైన్ కు లింక్ పెట్టారు. దీంతో చెప్పాల్సిన విషయం చెప్పేశారు. ఆ ప్రభావం కారణమేమో రాహుల్ టూర్ పై మంత్రి కెటీఆర్ తీవ్రమైన పరుష వ్యాఖ్యలు చేశారు. అవేంటో మీరూ చూడండి. ‘‘రాష్ట్రానికి కొత్త బిచ్చగాళ్లు వచ్చారు. నాలుగేళ్లుగా రానివాళ్లు ఇప్పుడు మళ్లీ ఓట్ల కోసం వచ్చారు. కాంగ్రెసోళ్లే లుచ్ఛాగాళ్లు. కాంగ్రెస్‌, అవినీతి.. అవిభక్త కవలలు. ఆ పార్టీ పాలనలో అన్ని రంగాల్లో అవినీతికి పాల్పడ్డారు. చివరకు పంచభూతాలను కూడా పంచభక్ష పరమాన్నాలుగా భోంచేసిన చరిత్ర కాంగ్రె్‌సది.

నిన్న రాహుల్‌గాంధీ పక్కన కూర్చున్నోళ్లలో సగం మంది సీబీఐ కేసులతో బెయిల్‌ మీద ఉన్నోళ్లే. ఉత్తమ్‌ ఎన్నికల సమయంలో మూడు కోట్లతో అడ్డంగా దొరికిపోయాడు. చివరికి రాహుల్‌గాంధీ కూడా బెయిల్‌పై వచ్చినోడే. వీళ్లా అవినీతి గురించి మాట్లాడేది’’ అంటూ మండిపడ్డారు. అసలు గన్‌పార్కు గురించి రాహుల్‌కు ఏం తెలుసని అక్కడికెళ్లి నివాళులర్పించారని నిలదీశారు. తన సొంత నియోజకవర్గమైన అమేథీలోని మున్సిపాలిటీని గెలిపించుకోలేని రాహుల్‌గాంధీ తెలంగాణలో కాంగ్రెస్ ను గెలిపిస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు. కొత్త బిచ్చగాళ్లు తెలంగాణలో మోపయ్యారని.. సంక్రాంతికి గంగిరెద్దోళ్లు వచ్చినట్లు ఎన్నికలు దగ్గరకు రావడంతో ఢిల్లీ నుంచి రాహుల్‌ గాంధీ, వాళ్లూ, వీళ్లూ, వస్తున్నారని అన్నారు.

Next Story
Share it