Telugu Gateway
Cinema

కైరా అద్వానీ నెక్ట్స్ సినిమా రెడీ

కైరా అద్వానీ నెక్ట్స్ సినిమా రెడీ
X

బాలీవుడ్ భామ కైరా అద్వానీ తెలుగులో వరసపెట్టి సినిమాలు చేస్తోంది. తొలి సినిమా ‘భరత్ అనే నేను’తోనే సూపర్ హిట్ అందుకున్న ఈ భామ ..రెండవ తెలుగు సినిమాతో బిజీగా ఉంది. ఈ రెండు చిత్రాలను కూడా భారీ బడ్జెట్ తో సినిమాలు తీసే డీ వీ వీ దానయ్యకు చెందిన బ్యానరే కావటం విశేషం. రామ్ చరణ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోంది కైరా. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది.

అయితే ఇప్పుడు కైరా అద్వానీ కొత్తగా సంతకం చేసింది మాత్రం తెలుగు సినిమా కాదు. ఈ సారి భాలీవుడ్ సినిమాకు సంబంధించి సంతకాలు చేసినట్లు వెల్లడించింది ఈ బ్యూటీ. ఈ సినిమా పేరు ‘గుడ్ న్యూస్’ అని తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. అద్భుతమైన చిత్ర బృందంతో కొత్త జర్నీ ప్రారంభం కానుందని తెలిపింది. ఈ బాలీవుడ్ సినిమాలో అక్షయ్ కుమార్, కరీనా కపూర్, దిల్జీత్ దొసాన్జ్ తదితరులు ఉండబోతున్నారు.

Next Story
Share it