Telugu Gateway
Cinema

దుమ్మురేపుతున్న ఎన్టీఆర్

దుమ్మురేపుతున్న ఎన్టీఆర్
X

అరవింద సమేత రాఘవ సినిమాతో ఎన్టీఆర్ దుమ్మురేపుతున్నారు. ఆగస్టు 15ను పురస్కరించుకుని ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ యూట్యూబ్ లో పెద్ద సంచలనాలు నమోదు చేస్తోంది. కేవలం విడుదల చేసిన పదకొండు గంటల్లోనే దీన్ని 42 లక్షల మంది వీక్షించారు. టీజర్ లో ఎన్టీఆర్ చెప్పే సీరియస్ డైలాగ్ లు..యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ టీజర్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా దసరాకు ప్రేక్షకుల ముందుకు రానుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతదం శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది. ఇందులో ఎన్టీఆర్ కు జోడీగా పూజా హెగ్డె నటిస్తోంది.

Next Story
Share it