Telugu Gateway
Andhra Pradesh

జూనియర్ ఎన్టీఆర్ మాటను పట్టించుకోని హరికృష్ణ

జూనియర్ ఎన్టీఆర్ మాటను పట్టించుకోని హరికృష్ణ
X

‘మా కుటుంబంలో జరిగిన విషాదం మరే కుటుంబంలోనూ జరగకూడదు. కారులో ప్రయాణించేటప్పుడు ఖచ్చితంగా సీటు బెల్ట్ పెట్టుకోండి.’ జూనియర్ ఎన్టీఆర్ నటించిన ప్రతి సినిమాలోనూ ఆయన వాయిస్ తో ఈ మాటలు సినిమా ప్రేక్షకులు అందరికీ సుపరిచితమే. 2014 సంవత్సరంలో హరికృష్ణ తనయుడు, ఎన్టీఆర్ సోదరుడు జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఎన్టీఆర్ ప్రతి సినిమాలోనూ ఈ మాటలు చెబుతూనే ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ తమ కుటుంబంలో జరిగిన విషాదాన్ని గుర్తుపెట్టుకుని తన వంతుగా ప్రజల్లో చైతన్యం నింపేందుకు హైదరాబాద్ పోలీసులు నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొంటూ..వీడియోల ద్వారా కూడా రోడ్డు భద్రతకు సంబంధించిన అంశాలపై ప్రజలను చైతన్య పరుస్తున్నారు. కానీ సాక్ష్యాత్తూ ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ సీటు బెల్టు పెట్టుకోని కారణంగా రోడ్డు ప్రమాదంలో మరణించటం నిజంగా విషాదం.

హరికృష్ణ సీటు బెల్టు ధరించి ఖచ్చితంగా ప్రాణాలతో బయటపడే ఛాన్స్ ఉండేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. హరికృష్ణ ప్రయాణించే కారులో సహజంగా ఎయిర్ బ్యాగులు ఉంటాయి. ప్రమాదం జరిగినా కూడా అవి ఓపెన్ అయితే చాలా వరకూ ప్రాణాపాయం తప్పుతుందన్న సంగతి తెలిసిందే. నిత్యం తన సినిమాల ద్వారా రోడ్డు ప్రమాదాలపై జూనియర్ ఎన్టీఆర్ ప్రజలను చైతన్య పరుస్తుంటే..హరికృష్ణ దీన్ని పట్టించుకోకపోవటంతో అదే తప్పుతో ప్రాణాలు పొగొట్టుకోవాల్సి రావటం అత్యంత విషాదకరం. అదే కారులో ప్రయాణించిన ఇద్దరు స్నేహితులు గాయాలతో బయటపడ్డారు. ఎన్టీఆర్ తన సినిమాకు సంబంధించిన ప్రతి ఫంక్షన్ తర్వాత కూడా అభిమానులకు ఓ సూచన చేస్తాడు. జాగ్రత్తగా ఇంటికి వెళ్లాలని ..ముఖ్యంగా రోడ్లపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తారు.

Next Story
Share it