‘బ్రహ్మనందం’ తనయుడి కొత్త సినిమా ‘మను’

టాలీవుడ్ లోకి బ్రహ్మనందం వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు గౌతమ్. ఆయన హీరోగా నటించిన పల్లకిలో పెళ్ళికూతురు, బసంతి సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకోలేకపోయాయి. బ్రహ్మనందం టాలీవుడ్ లో చాలా సంవత్సరాలు ఎదురులేని కమెడియన్ గా కొనసాగారు. కానీ ఆయన తనయుడికి మాత్రం పెద్దగా కలసి రాలేదు. చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు ‘మను’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ ఆదివారం నాడు విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన ఈ ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తి పెరిగేలా చేస్తోంది.
ఈ సినిమాను సస్పెన్స్ థ్రిల్లర్, లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఫేమస్ అయిన చాందిని చౌదరి ఈ సినిమాలో హీరోయిన్‌గా చేస్తోంది. గతంలోకూడా హీరోయిన్‌గా చేసినా.. అంతగా గుర్తింపు రాలేదు. నిర్వాణ సినిమాస్‌పై తెరకెక్కిన ఈ సినిమాకు ఫణీంద్ర నర్శెట్టి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
https://www.youtube.com/watch?v=Z77Qe0YvHmk