Telugu Gateway
Telangana

తెలంగాణ ముందస్తుకు ఈసీ అభ్యంతరాలు?!

తెలంగాణ ముందస్తుకు ఈసీ అభ్యంతరాలు?!
X

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కెసీఆర్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘ముందస్తు ఎన్నికల’కు కేంద్ర ఎన్నికల సంఘం నో చెప్పిందా?. ఇప్పుడు అధికార వర్గాల్లో ఇదే హాట్ టాపిక్. డిసెంబర్ లో అసెంబ్లీకి ఎన్నికలు పెట్టి..మళ్లీ ఆరు నెలల్లోపే పార్లమెంట్ కు ఎన్నికలు పెట్టాలంటే ఖర్చు గణనీయంగా పెరుగుతుంది. రెండుసార్లు ఏర్పాటు..ఎన్నికల హంగామా. అంతే కాకుండా భద్రతా దళాల మోహరింపు..ఎన్నికల ఏర్పాటు వంటి భారీ కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఎలాంటి బలమైన కారణం లేకుండా అసెంబ్లీ రద్దు చేశారనే అంశంతో ఓ సారి అసెంబ్లీకి, మరోసారి పార్లమెంట్ కు ఎన్నికలు పెట్టాల్సిన అవసరం ఏముందని కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసిందని..అధికార, రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇదే అంశంపై చర్చించటానికి కొంత మంది ఉన్నతాధికారులు..రాజకీయ నేతలు ఢిల్లీలో తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్రంలోని మోడీ సర్కారు కూడా డిసెంబర్ లో ముందస్తుకు రెడీ అయితే ఎన్నికలు ఓకే సారి వస్తాయి కానీ...విడిగా అయితే తెలంగాణకు ఎన్నికలు జరపటం అనుమానమేననే కొత్త వాదన కూడా తెరపైకి వస్తోంది.

షెడ్యూల్ లేక పోయినా ముఖ్యమంత్రి కెసీఆర్ ఆకస్మికంగా శుక్రవారం నాడు ఢిల్లీ బయలుదేరి వెళ్లాలని నిర్ణయించుకోవటం వెనక కూడా ఇదే కారణం అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి గత ఢిల్లీ టూర్ లోనే ప్రధాని మోడీతో ఈ అంశంపై చర్చించారని..ఇప్పుడు సీఈసీ అసలు తెలంగాణలో ముందస్తు ఎన్నికల అవసరం ఏముందనే వాదన తెరపైకి తేవటంతో క్లారిటీ కోసమే కెసీఆర్ ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారనే వాదన విన్పిస్తోంది. ఒక వేళ సీఈసీ ముందస్తుకు ససేమిరా అంటే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకునేందుకే మంత్రుల సమావేశంలో ముందస్తు అంటే..ఆరు నెలల్లోపు ఎప్పుడైనా ఎన్నికల అంశంపై చర్చించామనే వాదన తెరపైకి తెచ్చినట్లు చెబుతున్నారు. మరి కెసీఆర్ కోరుకున్నట్లు అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ లోపు పూర్తవుతాయా? లేక షెడ్యూల్ ప్రకారమే అన్న సంగతి త్వరలోనే తేలనుంది. మొత్తానికి తెలంగాణ రాజకీయ వాతావరణం రోజురోజుకి ఆసక్తికరంగా మారుతోంది. ఎలాంటి సహేతుకమైన కారణాలు లేకుండా..ఏవో రాజకీయ కారణాలతో ముందస్ఎతు న్నికలకు పోవాలనుకుంటే..అందుకు ఈసీ తలూపటం కూడా విమర్శలకు కారణమయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

Next Story
Share it