Telugu Gateway
Telangana

‘కార్పొరేట్ల’ చేతికి ఎలక్ట్రానిక్ మీడియా

‘కార్పొరేట్ల’ చేతికి ఎలక్ట్రానిక్ మీడియా
X

తెలుగు మీడియా బడా ‘కార్పొరేట్ల’ చేతికి వెళుతోంది. చాలా కాలం నుంచి మీడియాలో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెడుతూనే ఉన్నా..ఇప్పుడు ఆ పరిస్థితి మరింత పెరుగుతోంది. గతంలో ఎన్నడూలేని రీతిలో ఇప్పుడు మీడియాను ప్రభుత్వాలు..కార్పొరేట్ సంస్థలే శాసిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాస్తే ఒక్క యాడ్ రాదు. కార్పొరేట్ కంపెనీల మీద రాస్తే యాడ్స్ రావు. ఏపీలో...తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని పరిస్థితులను మీడియా ఎదుర్కొంటోంది. ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలన సమయంలో మీడియా వ్యవహరించిన తీరుకు...ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల్లో మీడియా వ్యవహరిస్తున్న తీరుకు తేడా కొట్టొచ్చినట్లు కనపడుతోంది. సరిగ్గా సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ మీడియాలో పరిణామాలు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే కమ్యూనిస్టు పార్టీల చేతిలో ఉన్న టీవీ99, టెన్ 10 టీవీ యాజమాన్యాల బదలాయింపు జరిగిపోగా..ఇప్పుడు తెలుగులో నెంబర్ వన్ ఛానల్ గా ఉన్న టీవీ9 యాజమాన్యం కూడా త్వరలోనే మారనుంది.

ఈ ఛానల్ ను తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పారిశ్రామిక సంస్థలు దక్కించుకోనున్న విషయం తెలిసిందే. కారణాలు ఏమైనా అటు ఏపీలోనూ..ఇటు తెలంగాణలోనూ ప్రభుత్వంలో జరిగే కుంభకోణాలు..అక్రమాలు ఏమీ బయటకు రావటం లేదు. మీడియా కూడా అస్మదీయ ప్రభుత్వాలు ఉంటే ఒక రకంగా..తస్మదీయ ప్రభుత్వాలు ఉంటే మరో రకంగా వ్యవహరించటం చూసిందే. అయితే ఇప్పుడు ఛానళ్లు అన్నీ కార్పొరేట్ల చేతికి వెళుతుండటంతో రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం కన్పిస్తోంది.

Next Story
Share it