చరిత్ర సృష్టించిన చిరంజీవి..24 గంటల్లో 1.20 కోట్ల వ్యూస్
టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి కొత్త చరిత్ర సృష్టించారు. సైరా నరసింహరెడ్డికి సంబంధించిన టీజర్ యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది. కేవలం 24 గంటల్లోనే ఏకంగా కోటి ఇరవై లక్షల మంది ఈ టీజర్ ను వీక్షించటం ఓ రికార్డు. ఇది టాలీవుడ్ చరిత్రలో రికార్డుగా అభివర్ణిస్తున్నారు. చిరంజీవి పుట్టిన రోజును పురస్కరించుకుని మంగళవారం నాడే టీజర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తొలి స్వాతంత్ర్య సమరయోధుడిగా పేరు తెచ్చుకున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
మెగా హీరో రామ్ చరణ్ నిర్మాత అయితే..సురేందర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సోషల్ మీడియాలో టీజర్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. వ్యూస్ విషయంలోనూ సైరా సరికొత్త రికార్డ్ ను నమోదు చేసింది. అన్ని డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో కలిపి ఈ టీజర్ 24 గంటల్లో 12 మిలియన్ల వ్యూస్ సాధించినట్టుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది.