Telugu Gateway
Offbeat

ఓ సారి గోవా బీచ్ కు వెళితే......!

ఓ సారి గోవా బీచ్ కు వెళితే......!
X

అక్కడకు వచ్చేది అంతా పర్యాటకులే. మహిళలు మొదలుకుని అందరూ స్వేచ్చగా...హాయిగా విహరిస్తుంటారు. విదేశీ మహిళలు అయితే..మరింత స్వేచ్చగా ఉంటారు. వారి తరహాలో వారు స్విమ్మింగ్ డ్రెస్ లు వేసుకుంటారు. దేశీయ యువతులూ కొన్నిసార్లు వాళ్లకు పోటీగా అన్నట్లు ఉంటారు. ఎవరిష్టం వాళ్లది. అభ్యంతరకరంగా ప్రవర్తించనంతవరకూ ఎవరూ ఏమీ అనరు. కాకపోతే కొంత మంది అదే పనిగా రహస్యంగా కెమెరాలు పెట్టి బీచ్ ల్లో తిరిగే విదేశీయులు..మహిళల వీడియోలను చిత్రీకరించి వాటిని తీసుకొచ్చి యూట్యూబ్ లో పెట్టేస్తున్నారు. మరీ ఎవరినైనా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే తప్ప..పెద్దగా అభ్యంతరం చెప్పిన దాఖలాలు ఉండవు. ఈ ట్రెండ్ ఒక్క గోవా బీచ్ లోనే కాదు..భారత్ లోని చాలా బీచ్ ల్లో ఇదే పరిస్థితి. అయితే ఈ తరహా సీక్రెట్ కెమెరాలపై మహిళలు ఉద్యమాలు ప్రారంభించారు.

కాకపోతే ఇది మన దేశంలో కాదులేండి. ‘ నా జీవితం..నీ అశ్లీ చిత్రం’ కాదు అంటూ దక్షిణ కొరియాలో మహిళల ఉద్యమబాట పట్టారు. ఇలా రహస్య కెమెరాలతో తమను చిత్రీకరించటం స్వేచ్చకు భంగం కలిగించటమే అని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు రికార్డ్‌ చేస్తున్నవారిని కఠినంగా శిక్షించాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. ఇలా రహస్య కెమెరాల బారిన పడేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రతి ఏటా ఈ బాధిత మహిళల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. ప్రస్తుతం దక్షిణ కొరియాలో మొదలైన ఈ ఉద్యమం త్వరలోనే భారత్ కు విస్తరించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు.

Next Story
Share it