Telugu Gateway
Cinema

అమెరికాలో ‘గూఢచారి’ సంచలన వసూళ్లు

అమెరికాలో ‘గూఢచారి’ సంచలన వసూళ్లు
X

అడివి శేష్ సినిమా అంటేనే ఏదో ఒక ప్రత్యేకత ఆశిస్తారు ప్రేక్షకులు. వారి అంచనాలకు అనుగుణంగానే తెరకెక్కిన తాజా చిత్రం ‘గూఢచారి’. ఈ సినిమా అమెరికాలో అద్భుతమైన వసూళ్లు సాధిస్తూ దూసుకెళ్తోంది. హాలీవుడ్ సినిమాలను తలదన్నె రీతిలో రిసెర్చ్ అనాలసిస్ వింగ్ (రా) వంటి సంస్థల్లో నియామకాలు ఎలా ఉంటాయి?. అవి ఎలా పనిచేస్తాయనే అంశాన్ని చాలా సీరియస్..అక్కడక్కడ వెన్నెల కిషోర్ కామెడీ మేళవించి తెరకెక్కించారు. ఈ సినిమాకు ఫస్ట్ డే ..ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది.

శనివారం వరకూ అమెరికాలో ఈ సినిమా మొత్తం 2.14 కోట్ల రూపాయల వసూళ్ళు సాధించిందని తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ సినిమాలో అడివి శేష్ కు జోడీగా శోభిత ధూళిపాళ్ల నటించింది. త్రినేత్ర టీమ్ సభ్యులుగా వెన్నెల కిషోర్, సుప్రియ, ప్రకాష్ రాజ్ తదితరులు నటించారు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. విశేషం ఏమిటంటే ఈ శుక్రవారం నాడు విడుదలైన మూడు సినిమాలు కూడా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదనే చెప్పొచ్చు.

Next Story
Share it