Top
Telugu Gateway

బ్రేకప్...ఫైరింగ్

బ్రేకప్...ఫైరింగ్
X

ప్రేమలు సహజం. విడిపోవటాలు సహజం. కానీ కొంత మందిలో వీటి విషయంలో స్పందన మాత్రమే షాకింగ్. బ్రేకప్ చెప్పిందని ఓ అమ్మాయిని కాల్చేయటానికి తెగబడ్డాడు ఆ వ్యక్తి. ఈ ఘటన ఢిల్లీలో కలకలం రేపింది. కేవలం బ్రేకప్ చెప్పిందనే కారణంతో తుపాకీ తీసుకొచ్చి టపా టపా ఆమెపై కాల్పుల వర్షం కురిపించాడు. అదృష్టవశాత్తు ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఢిల్లీలోని భరత్‌ నగర్‌కు చెందిన 24 ఏళ్ల యువతి ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ (సీఏ)గా పనిచేస్తోంది. స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్‌ ఉద్యోగి, ఆమె ప్రేమించుకున్నారు. కొంతకాలం తర్వాత మనస్పర్థలు రావడంతో వీరు విడిపోయారు.

జగ్రాన్‌ మండల్‌లో పనిచేసే ప్రియుడి తీరు నచ్చక పోవడంతో ఆ సీఏ అతడికి బ్రేకప్‌ చెప్పి వెళ్ళిపోయింది. ఆమెపై కక్ష పెంచుకున్న ఆ యువకుడు మాజీ ప్రేయసి బంధువుల ఇంటికి వెళ్లిందన్న విషయం తెలుసుకున్నాడు. ప్లాన్‌ ప్రకారం తుపాకీ తీసుకుని ప్రేయసి బంధువుల ఇంటికి వెళ్లాడు. ఎవరో డోర్‌ తట్టారని ఆ సీఏ వెళ్లి తలుపు తీయగా ఒక్కసారిగా కాల్పుల శబ్ధం వచ్చింది. బంధువులు వచ్చి చూడగా బుల్లెట్‌ గాయాలతో బాధితురాలు నిశ్చల స్థితిలో ఉంది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తనకు బ్రేకప్‌ చెప్పినందుకే ఈ ఘటనకు పాల్పడినట్లు నిందితుడు పోలీసుల విచారణలో అంగీకరించాడు.

Next Story
Share it