Telugu Gateway
Andhra Pradesh

‘యాత్ర’ టీజర్ విడుదల

‘యాత్ర’ టీజర్ విడుదల
X

తెలుగు రాజకీయాల్లో రాజకీయాల్లో అప్పటి ప్రతిపక్ష నేత రాజశేఖర రెడ్డి చేసిన పాదయాత్ర ఎంతటి ప్రభావం చూపించిందో తెలిసింది. మండే ఎండల్లో ఆయన చేసిన పాదయాత్ర అప్పట్లో కాంగ్రెస్ కు అధికార పీఠాన్ని అందించింది. దీని వెనక పాదయాత్ర ఒక్కటే కారణం కాకపోయినా..ఇది కూడా ఓ ప్రధాన కారణం అని ఖచ్చితంగా చెప్పొచ్చు. వైఎస్ పాదయాత్ర ఘట్టాలు, ఆయన జీవిత చరిత్రతో ‘యాత్ర’ పేరుతో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మళయాళ సూపర్ స్టార్ మమ్ముటి వైఎస్ పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఆదివారం నాడు విడుదల చేశారు.

అందులో మమ్ముటి అచ్చం వైఎస్ ను తలపించేలా ఉన్నారు. ఈ సినిమాను ఆనందోబ్రహ్మ ఫేమ్‌ మహి వీ రాఘవ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. టీజర్ లో అన్నీ పొలిటికల్ డైలాగ్సే ఉన్నాయి. ‘తెలుసుకోవాలని ఉంది.. వినాలని ఉంది.. ఈ కడప దాటి ప్రతీ గడపలోకి వెళ్లాలని ఉంది.. వాళ్లతో కలిసి నడవాలని ఉంది.. వాళ్ల గుండె చప్పుడు వినాలని ఉంది. గెలిస్తే పట్టుదల అంటారు, ఓడిపోతే మూర్ఖత్వం అంటారు. పాదయాత్ర నా మూర్ఖత్వమో.. పట్టుదలో... చరిత్రే నిర్ణయిస్తుంది’ అంటూ బ్యాక్‌ గ్రౌండ్‌లో డైలాగులు వినిపించాయి.

https://www.youtube.com/watch?v=rQq32oiMa54

Next Story
Share it