Telugu Gateway
Cinema

‘అందమైన దెయ్యం’గా త్రిష

‘అందమైన దెయ్యం’గా త్రిష
X

దెయ్యాలు కూడా అందంగా ఉంటాయా? అన్నదే కదా మీ సందేహం. అవును ఆమె నటిస్తున్న ‘మెహినీ’ సినిమాలో త్రిష ఓ అందమైన దెయ్యంగా కన్పిస్తోంది. విదేశాల్లో చిత్రీకరించిన రిచ్ షాట్లతో ...అందమైన లుక్స్ తో త్రిష ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ లో కన్పిస్తారు. ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోలందరితో సినిమాలు చేసిన ఈ భామ ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత మరో హారర్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రానుంది. ఈ సినిమాకు ఆర్ మాదేష్ దర్శకుడు. జూలై 27నే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ట్రైలర్ సన్నివేశాలు ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలను పెంచాయనటంలో ఏ మాత్రం సందేహం లేదు. ఓ వైపు రొమాన్స్...హారర్ దృశ్యాలు...అద్భుతమైన సీన్లు ప్రేక్షకులను ఆలరిస్తాయి.

https://www.youtube.com/watch?time_continue=5&v=EJJk6WT1EA8

Next Story
Share it