Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

మిల్కీబ్యూటీ పెళ్లి చేసుకోబోతుందా?!

0

ప్రస్తుతం టాలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్. తరచూ ఒకప్పుడు టాలీవుడ్ లో వెలుగు వెలిగిన హీరోయిన్ల పెళ్లి వార్తలు షికారు చేయటం సహజమే. అదిగో..అనుష్క పెళ్లి..ఇదిగో వరుడు అంటూ గత కొన్ని సంవత్సరాలుగా హంగామాతో వార్తలు వస్తుంటాయి..పోతుంటాయి. అనుష్క పెళ్లి మాత్రం ఇంతవరకూ కాలేదు. అయితే ఈ మధ్యే అనుష్క పేరెంట్స్ ప్రభాస్ లాంటి వరుడి కోసం చూస్తున్నామంటూ ఓ ప్రకటన ఇచ్చారు. ఇప్పుడు అదే తరహాలో  నెట్టింట తమన్నా పెళ్ళి వార్త హల్ చల్ చేస్తోంది. ఇందులో నిజం ఎంతో ఆమె స్పందిస్తే తప్ప..తెలియటం కష్టమే. దశాబ్ద కాలంపైగా తెలుగుతోపాటు తమిళ చిత్రాల్లో తమన్నా తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. తెలుగులో అయితే తమన్నాకు ఎన్నో హిట్లు ఉన్నాయి. తాజా సినిమా బాహుబలి తొలి పార్ట్ లో అయితే తమన్నా పాత్రకు యూత్ ఫిదా అయ్యారు.

- Advertisement -

తమన్నా చాలా వరకూ తన కెరీర్ లో గ్లామర్ పాత్రలతోనే రాణించారు. పెద్దగా నటనకు స్కోప్ ఉన్న పాత్రలు ఆమె దక్కింది లేదు..చేసింది లేదు. అయితే గత కొంత కాలంగా తమన్నాకు అవకాశాలు కూడా తగ్గుముఖం పట్టాయి. అందుకే ఆమె పెళ్లి చేసుకునే యోచనలో ఉన్నారని..కుటుంబ పెద్దలు వరుడి ఎంపిక కార్యక్రమం కూడా పూర్తి చేసినట్లు టాక్. అమెరికాకు చెందిన ఓ డాక్టర్‌తో త్వరలోనే తమన్నా వివాహం జరుగునుందన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తమన్నా చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో పరిశ్రమలోకి కొత్త కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇస్తున్నారు. దీంతో నిర్మాతలు కూడా పాత వాళ్లకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వటం లేదు.

Leave A Reply

Your email address will not be published.