Telugu Gateway
Cinema

మీ టైమ్ ఓ రెండు గంటలు అప్పిస్తారా...!

మీ టైమ్ ఓ రెండు గంటలు అప్పిస్తారా...!
X

టైమ్ ను కూడా అప్పు అడగొచ్చా?. అంటే అవుననే అంటున్నారు హీరో నితిన్. శ్రీనివాస కళ్యాణం సినిమాలో హీరోయిన్ రాశీ ఖన్నాను అదే అడిగేశాడు. ఓ రెండు గంటల టైమ్ అప్పుకావాలన్నాడు. అదేంటి అనుకుంటున్నారా?. అయితే ఓ సారి ఈ టీజర్ పై లుక్కేయండి అసలు విషయం మీకే తెలిసిపోతుంది. అంతే కాదు...రాశీఖన్నా కూడా తక్కువేం తినలేదు. ఏం..అబ్బాయిలకు మాత్రమే అమ్మాయిలు మద్దొస్తారా?.మాకు అబ్బాయిలు ముద్దురారా అంటూ నితిన్ బుగ్గపై ముద్దు పెట్టేస్తోంది. ఇలాంటి సరదా సన్నివేశాలతో కూడిన టీజర్ శ్రీనివాస్ కళ్యాణం సినిమా టీజర్ హల్ చల్ చేస్తోంది. ఈ సినిమా ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమాను వేగ్నేష సతీష్ దర్శకత్వం వహించారు.

https://www.youtube.com/watch?v=6Zmt2eRg4Vk

Next Story
Share it