Top
Telugu Gateway

సోనాలి బింద్రేకు క్యాన్సర్

సోనాలి బింద్రేకు క్యాన్సర్
X

బాలీవుడ్ హీరోయిన్లు చాలా మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఇప్పుడు వారి జాబితాలో సోనాలి బింద్రే కూడా చేరారు. స్వయంగా ఆమె తనకు క్యాన్సర్ సోకిందని..తాజాగా జరిగిన వైద్య పరీక్షల్లో ఈ విషయం వెల్లడైందని పేర్కొంది. అయితే స్నేహితులు..బంధువులు ఇచ్చే దైర్యంతో వైద్యం పొందుతున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఇదొక్కటేమార్గం అని పేర్కొంది. సోనాలి బింద్రే పలు తెలుగు సినిమాల్లోనూ నటించి ప్రేక్షకుల ఆదరణ పొందింది. సోనాలి ప్రస్తుతం న్యూయార్క్ లో ఉంటూ వైద్యం పొందుతోంది. ఇన్ స్టాగ్రామ్ లో ఈ విషయాన్ని షేర్ చేసిన బింద్రే ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. జీవితం మలుపుల్లో నాకిదో పరీక్ష అని పేర్కొంది. గత కొన్ని రోజులుగా స్నేహితులు..బంధువులు తనపై కురిపిస్తున్న ప్రేమ ఎంతో గొప్పగా ఉందని పేర్కొన్నారు.

Next Story
Share it