Telugu Gateway
Cinema

బాహుబలి రికార్డును బద్దలు కొట్టిన సంజు

బాహుబలి రికార్డును బద్దలు కొట్టిన సంజు
X

సంజు. గత కొన్ని రోజులుగా బాలీవుడ్ ను షేక్ చేస్తున్న సినిమా. కలెక్షన్ల విషయంలోనూ దూసుకెళుతోంది. సంజయ్ దత్ జీవిత చరిత్రతో తెరకెక్కిన ఈ సినిమాపై విమర్శలు ఉన్నాయి. అయితే సినిమాపై మాత్రం పెద్ద ఎత్తున ప్రశంసల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో సంజయ్ దత్ గా నటించిన రణ్ బీర్ కపూర్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఒక్క రణ్ బీరే కాదు..సినిమాలోని అన్ని క్యారెక్టర్లు పర్పెక్ట్ గా సెట్ అయ్యాయని సమీక్షకులు అభిప్రాయపడ్డారు. ఈ సంజు రికార్డులకు..టాలీవుడ్ కు ఓ సంబంధం ఉంది. తెలుగులో తెరకెక్కి దేశ వ్యాప్తంగా రికార్డులు సృష్టించిన బాహుబలి 2 హిందీ రికార్డులను సంజు అధిగమించటం మరో విశేషం. సంజు గత ఆదివారం(మూడో రోజు) రూ. 46.71 కోట్ల కలెక్షన్లు వసూలు చేసింది.

అంతకు ముందు ఆ రికార్డు రూ.46.50 కోట్లతో బాహుబలి-2(హిందీ వర్షన్‌) పేరిట ఉంది. మొత్తానికి బాహుబలి-2కి చెందిన ఓ రికార్డును అధిగమించామని బాలీవుడ్‌ మీడియా కథనాలు ప్రచురించేస్తోంది. రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మూడు రోజుల్లోనే 120 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి మరో రికార్డును నమోదు చేసింది. అంతే కాకుండా తొలిరోజ దాదాపు రూ.35 కోట్లు వసూలు చేసి ఈ ఏడాది హయ్యెస్ట్‌ ఓపెనర్‌గా నిలవటంతోపాటు.. రణ్‌బీర్‌ కెరీర్‌ బెస్ట్‌ ఓపెనర్‌గా రికార్డు నమోదు చేసింది.

Next Story
Share it