Telugu Gateway
Cinema

నవంబర్ 29న రజనీ 2.ఓ విడుదల

నవంబర్ 29న రజనీ 2.ఓ విడుదల
X

ఎప్పటి నుంచో వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న ప్రతిష్టాత్మక సినిమా 2.ఓ విడుదలకు రంగం సిద్ధం అయింది. ఇది నిజంగా రజనీ అభిమానులకు శుభవార్తే. ఈ ఏడాది నవంబర్ 29న సినిమాను విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా సినిమా విడుదలలో విపరీతమైన జాప్యం జరిగింది. రోబోకు సీక్వెల్ గా వస్తున్న 2.ఓపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమా దర్శకుడు శంకర్ కావటం కూడా ఓ ప్రధాన కారణం. శంకర్, రజనీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన రోబో సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే.

2.ఓ విడుదల తేదీ ప్రకటించటంతో ఇక ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ మధ్యే రజనీకాంత్ నటించిన కాలా సినిమా విడుదల అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చెప్పిన తేదీ ప్రకారం 2.ఓ విడుదల అయితే గత 23 సంవత్సరాల్లో రజనీకాంత్ రెండు సినిమాలో ఒకే ఏడాదిలో విడుదల ఇదే అవుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. 2.ఓ ఆడియో ఫంక్షన్ అట్టహాసంగా కొద్ది రోజుల క్రితం దుబాయ్ లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా చేస్తుంటే...రజనీకి జోడీగా అమీ జాక్సన్ నటించారు.

Next Story
Share it