Telugu Gateway
Telangana

కెసీఆర్ సర్కారుపై సుబ్రమణ్యస్వామి ఆగ్రహం

కెసీఆర్ సర్కారుపై సుబ్రమణ్యస్వామి ఆగ్రహం
X

హైదరాబాద్ నుంచి స్వామి పరిపూర్ణానందను బహిష్కరించిన అంశంపై బిజెపి ఎంపీ సుబ్రమణ్యస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే చట్టపరంగా ముందుకెళతానని..అదే సమయంలో నష్టపరిహారం కూడా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ మేరకు సుబ్రమణ్యస్వామి తెలంగాణ సీఎం కెసీఆర్ కు గురువారం నాడు లేఖ రాశారు. పరిపూర్ణానందస్వామిని 1980 సంవత్సరానికి సంబంధించి సంఘ వ్యతిరేక, ప్రమాద కార్యకలాపాల నిరోధక చట్టంలోని సెక్షన్ యు/ఎస్ 3 ప్రకారం నగరం నుంచి బహిష్కరించారని..ఇది గుండాలను నగరం నుంచి బహిష్కరించేందుకు ఉద్దేశించిన సెక్షన్ అని పేర్కొన్నారు.

ప్రభుత్వం ఓ సారి సెక్షన్ 3లో ఏమి ఉందో సరిచూసుకోవాలన్నారు. సమాజంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న ఓ స్వామిజీని ఎలా గూండా చట్టం ప్రకారం బహిష్కరిస్తారని సుబ్రమణ్యస్వామి ప్రశ్నించారు. ఇది పరిపూర్ణానందను అవమానించటం, పరువుకు నష్టం కలిగించే చర్య అని తన లేఖలో పేర్కొన్నారు. ఇది పరిపూర్ణానంద హక్కులను హరించటమే అన్నారు.

Next Story
Share it