Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

‘ఎన్టీఆర్’తొలి షెడ్యూల్ పూర్తి

0

ఇది బయోపిక్ ల సీజన్. అందులో భాగంగానే సీనియర్ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో కూడిన సినిమా కూడా శరవేగంగా తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ పాత్రలో ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణే నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన తొలి షెడ్యూల్ పూర్తి అయింది. ఎన్టీఆర్ భార్య పాత్రకు బాలీవుడ్ నటి విద్యాబాలన్ ను ఎంపిక చేశారు. ఆమె తాజాగా షూటింగ్ లో పాల్గొన్నారు. తొలుత ఈ సినిమాకు దర్శకత్వం వహించే బాధ్యతలు తేజ చేపట్టారు. ఆ తర్వాత ఆకస్మికంగా ఆయన తప్పుకోవటంతో బాలకృష్ణతో చారిత్రక సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ తెరకెక్కించిన క్రిష్ ఈ సినిమాకు దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.

- Advertisement -

తొలి షెడ్యూల్ పూర్తి అయిన విషయాన్ని క్రిష్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సినిమాలో భారీ తారాగణం ఉండబోతోంది. ఎన్టీఆర్ తో  కలసి పనిచేసిన హీరోలు..హీరోయిన్లను ఎంపిక చేసే ప్రక్రియ వేగంగా సాగుతోంది. చంద్రబాబు పాత్రలో దగ్గుబాటి రానా చేస్తున్న సంగతి తెలిసిందే.  సరిగ్గా  ఈ సినిమాను ఎన్నికల ముందు విడుదల చేసే యోచనలో ఉన్నారు చిత్ర యూనిట్.

 

Leave A Reply

Your email address will not be published.