Telugu Gateway
Cinema

‘ముద్ర’ వేస్తానంటున్న నిఖిల్

‘ముద్ర’ వేస్తానంటున్న నిఖిల్
X

హీరో నిఖిల్ టాలీవుడ్ లో విభిన్నమైన కథలను ఎంచుకోవటం ద్వారా తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకుంటున్నారు. అక్కడక్కడ పరాజయాలు ఎదురైనా తన దారి మాత్రం మార్చుకోవటం లేదు. ప్రస్తుతం ఈ కుర్ర హీరో ‘ముద్ర’ వేయటానికి రెడీ అయిపోతున్నారు. ఆయన కొత్త సినిమా పేరే ‘ముద్ర’. ఇందులో నిఖిల్ కు జోడీగా లావణ్య త్రిపాఠి నటిస్తోంది. ఈ సినిమాలో నిఖిల్ విలేకరిగా నటించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే 50 శాతంపైగా షూటింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళీ తదితరులు ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

Next Story
Share it