Telugu Gateway
Andhra Pradesh

‘అవిశ్వాసం’ ఎపిసోడ్ లో ‘లోకేష్ మిస్సింగ్’!

‘అవిశ్వాసం’ ఎపిసోడ్ లో ‘లోకేష్ మిస్సింగ్’!
X

మంత్రి నారా లోకేష్ ఎక్కడ?. ఏపీ కేబినెట్ నిర్ణయం అయిపోయి నెలలు గడుస్తున్నా అమలు చేయని ‘నిరుద్యోగ భృతి’ ప్రకటన చేయటానికి..క్రెడిట్ క్లెయిం చేసుకోవటానికి రాత్రిపూపట మీడియా ముందుకొచ్చిన నారా లోకేష్.. ఏపీకి సంబంధించి ‘అత్యంత కీలకమైన’ అవిశ్వాసం జరిగిన సమయంలో ఎక్కడా కన్పించలేదు. ఇంచుమించు మంత్రులందరూ మాట్లాడారు. కానీ నారా లోకేష్ మాత్రం ఈ విషయంలో ఎక్కడా నోరు తెరవలేదు. ఓ వైపు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ‘ట్విట్టర్’లో ట్వీట్లు చేయటం తప్ప..అవిశ్వాసం జరుగుతుంటే ఏమి చేస్తున్నారు?. ఎక్కడ ఉన్నారు? అని ప్రశ్నించారు. అవిశ్వాసం తర్వాత అయిన పవన్ కళ్యాణ్ మీడియా ముందుకు వచ్చి స్పందించాల్సింది. కానీ ఆయన ఈ అంశంలో చంద్రబాబుపై విమర్శలకూ ట్విట్టర్ నే ఎంచుకున్నారు. ఇక పవన్ సంగతి వదిలేస్తే ‘దొడ్డిదారిన’ వచ్చి మంత్రి అయిన లోకేష్ కు ఈ అంశంపై స్పందించాల్సిన అవసరం లేదా?. నిత్యం మాట్లాడటంలో తడబడుతున్న నారా లోకేష్ ఈ విషయంలో స్పందిస్తే లేనిపోని సమస్యలు వస్తాయని చంద్రబాబే వద్దన్నారా?. ప్రతిపక్షంలో ఉన్న పవన్ స్పందనను కోరిన చంద్రబాబు..మంత్రి పదవిని ఎంజాయ్ చేస్తూ..అధికారం చెలాయిస్తున్న లోకేష్ నిత్యం ‘ట్విట్టర్’ లో చేస్తున్న కోతల సంగతిని విస్మరించటం విశేషం. ఏదో ఆశించి తెలుగుదేశం లోక్ సభలో అవిశ్వాసం పెడితే అది కాస్తా రివర్స్ అయి తెలుగుదేశానికి, చంద్రబాబుకే షాక్ ల మీద షాక్ ఇచ్చింది.

విభజనతో ఎక్కువగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కు కేంద్రంలోని బిజెపి సర్కారు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవటంలో కూడా చంద్రబాబు ‘వైఫల్యాలే’ ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఓ సారి కేంద్రంతో గొడవ పడితే పోలవరం, రాజధాని ఆగిపోతాయని బిజెపితో కలసి ఉండగా వాదించిన..తర్వాత ఏపీలో మోడీ, బిజెపిపై వ్యతిరేకత పెరుగుతుందని..ప్రత్యేక హోదా సెంటిమెంట్ ఉందని గ్రహించి చంద్రబాబే ‘ఫ్లేటు ఫిరాయించారు’. అంతే కాదు...ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ బెటర్ అని బహిరంగంగా వ్యాఖ్యనించిన సందర్భాలు ఎన్నో. అయితే చంద్రబాబు రాజకీయ క్రీడను చూసి ఆయన కంటే ఎక్కువగా బిజెపి అదే పనిచేస్తోంది. ఏపీ నష్టపోవటానికి కారణం ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా చంద్రబాబే అని చెప్పాలి. కేవలం తన రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం ఏపీతో చంద్రబాబు ఆడుకుంటున్నారు. కేవలం అక్రమ దందాల కోసం ఎన్నో స్పెషల్ పర్పస్ వెహికల్స్ (ఎస్పీవీ)లను ఏర్పాటు చేసిన ఏపీ సర్కారు..కేంద్రం ఇచ్చే నిధుల విషయంలో మాత్రం ఎస్పీవీ ఏర్పాటుకు నిరాకరించటం వెనక మతలబు ఏమిటి?.

Next Story
Share it