Telugu Gateway
Cinema

‘నన్నుదోచుకుందువటే’ టీజర్ రిలీజ్

‘నన్నుదోచుకుందువటే’ టీజర్ రిలీజ్
X

‘సమ్మోహనం’ సినిమాతో సుధీర్ బాబు కొత్త రేంజ్ కు వెళ్లిపోయాడు. ఇప్పుడు తానే స్వయంగా నిర్మాత మారి తెరకెక్కిస్తున్న సినిమా ‘నన్ను దోచుకుందువటే’. సమ్మోహనం హిట్ తో ఈ సినిమాపై కూడా అంచనాలు పెరుగుతున్నాయి. ఇందులో సుధీర్ బాబుకు జోడీగా నభా నటేష్ హీరోయిన్ గా చేస్తోంది. ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్.

తాజాగా సినిమా టీజర్ ను విడుద చేశారు. ఈ సినిమాలో సుధీర్‌ బాబు మేనేజర్‌ పాత్రలో కనిపిస్తుండగా హీరోయిన్‌ నభా నటేష్‌ సాఫ్ట్‌ వేర్ ఇంజనీర్‌గా నటిస్తోంది. ఇతర కీలక పాత్రల్లో నాజర్‌, వేణులు నటిస్తున్న ఈ సినిమాకు అజనీష్‌ బి లోకనాథ్‌ సంగీతమందిస్తున్నారు. ఈ సినిమాను వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 13న రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

https://www.youtube.com/watch?v=un869tFyMKQ

Next Story
Share it